ఫిదా ఫస్టాఫ్ రివ్యూ..!
on Jul 21, 2017
చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న ప్రేమ కథ ఫిదా..అసలే శేఖర్ ప్రేమకథల స్పెషలిస్ట్..దానికి తోడు మెగా హీరో వరుణ్ తేజ్, ప్రేమమ్ లాంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలో నటించిన సాయి పల్లవి స్టారింగ్..ఇంకేముంది సినిమాకి భారీ హైప్ వచ్చేసింది. ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది..ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫస్టాఫ్ ఎలా ఉందో సన్నిహితులతో పంచుకుంటున్నారు ప్రేక్షకులు..ఆ సమాచారం ఆధారంగా మొదటి భాగం ఎలా ఉందో చూద్దాం..ఓ పెళ్లిలో కలిసిన తెలంగాణలోని బాన్సువాడుకు చెందిన అమ్మాయి..యూఎస్‌లో సెటిలైన ఆంధ్రా అబ్బాయి తమ కలలను ఎలా నెరవేర్చుకున్నారన్నదే కథ. ప్రతీ సీన్లో శేఖర్ మార్క్ పిక్చరైజేషన్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా వరుణ్, సాయిపల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను టచ్ చేస్తుందట. మరి ఫిదా ప్రేక్షుకుడిని ఫిదా చేసిందా లేదో తెలియాలంటే ఫుల్ రివ్యూ కోసం తెలుగువన్ని ఫాలో అవ్వండి.