ఆ 'కామకథ'లో ఆమె కూడా
on Nov 14, 2019
తెలుగులో కామ కథలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అవేనండీ 'లస్ట్ స్టోరీస్'. అమలా పాల్ ప్రధాన పాత్రలో దర్శకురాలు నందినీరెడ్డి ఒక లస్ట్ స్టోరీ షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు మరో లస్ట్ స్టోరీ 'ఘాజి', 'అంతరిక్షం' సినిమాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తోంది. ఈ కథలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు ఆషిమా నర్వాల్. సాధారణంగా ఈ పేరు చెప్తే గుర్తు పట్టడం కష్టమే. కానీ, 'నాటకం'లో నటించిన హీరోయిన్ అంటే కొంతమంది గుర్తుపట్టే ఛాన్స్ ఉంది.
'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ హ్యాంగోవర్ లో వచ్చిన తెలుగు సినిమాల్లో 'నాటకం' ఒక్కటి. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఫుల్ రొమాన్స్ తో తీశారు. ఆషిమా అందాలు ఆరబోసింది. కానీ, సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఆషిమా నర్వాల్ నటించిన హారర్ సినిమా 'జెస్సి' కూడా ప్లాప్ అయింది. తమిళ డబ్బింగ్ 'కిల్లర్'తో ఓ హిట్ ఆమె ఖాతాలో పడింది. కానీ, కొత్త సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇప్పుడీ 'లస్ట్ స్టోరీస్' ఆమెకు పేరు తీసుకొస్తాయని ఆశిస్తున్నట్టు ఉంది.