బన్నీ కంటే ఎన్టీఆరే బెస్టు
on Feb 25, 2017
దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ బ్రాహ్మణుడిగా కనిపించబోతున్నాడనగానే.. ఆ సినిమాని అదుర్స్ తో పోల్చడం మొదలెట్టారు సినీ అభిమానులు. అదుర్స్‌లో ఎన్టీఆర్ కూడా బ్రాహ్మణుడిగానే కనిపించాడు. అందులో చారి పాత్రలో అదరగొట్టాడు. అదుర్స్ విజయంలో ఎన్టీఆర్ కట్టూ బొట్టూ, అతని మాట తీరు కీలక పాత్ర పోషించాయి. ఆ తరహా పాత్ర ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ చేయలేరన్నంతగా పేరు తెచ్చుకొన్నాడు ఎన్టీఆర్.
అయితే అదే తరహా క్యారెక్టర్ని టచ్ చేసే ధైర్యం చేశాడు అల్లు అర్జున్. దువ్వాడ జగన్నాథమ్‌లో బన్నీ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడన్న సంగతి తెలియగానే ఆ పాత్రలో ఎన్టీఆర్ బెస్టా?? బన్నీ బెస్టా?? అనే పోలికలు మొదలయ్యాయి. ఫస్ట్ లుక్‌తో అదరగొట్టాడు బన్నీ. అయితే... టీజర్లో మాత్రం ఎన్టీఆర్ దరిదాపుల్లోకి కూడా బన్నీ వెళ్లలేకపోయాడు.
చారి బ్రాహ్మణ యువకుల పాత్రకు ఓ ట్రేడ్ మార్క్‌గా నిలిచింది. అదే తరహా పాత్ర పోషిస్తున్నప్పుడు సమ్ థింగ్ స్పెషల్ చూపించాల్సింది. కానీ... బన్నీ కట్టూ బొట్టూ, డైలాగ్ డెలివరీ.. అంతంత మాత్రంగానే అనిపించాయి. బ్రాహ్మణ స్లాంగ్‌ని పట్టుకోవడంలో బన్నీ ఫెయిల్ అయ్యాడని సినీ విశ్లేషకులు తేల్చేశారు. సినిమా అంతా.. ఇదే తరహాలో ఉంటే అది దువ్వాడ రిజల్ట్‌పై విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సినిమాలో అయినా.. దీనికంటే బెటర్ మెంట్ చూపించగలడో లేదో చూడాలి.