డీజే... రెండో ట్రైలర్ ఎందుకు దించినట్టు?
on Jun 12, 2017
ఓ సినిమాకి రెండు మూడు టీజర్లు ఉండొచ్చు. కానీ.. థియేటరికట్ ట్రైలర్ మాత్రం ఒకటే ఉంటుంది. రెండు నిమిషాల ట్రైలర్ కట్ చేస్తేనే అందులో సినిమా అంతా చూపించేశామేమో అని భయపడుతుంటారు దర్శక నిర్మాతలు. అందుకే... మరో ట్రైలర్ జోలికి వెళ్లరు. కానీ.. డీజే విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఓ ట్రైలర్ వచ్చిన వారం రోజులకే.. రెండో ట్రైలర్‌నీ దింపేసింది చిత్రబృందం. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్లో డీజే రెండో థియేటరికల్ ట్రైలర్‌ని చూపించారు. ఓ ట్రైలర్ ఉండగా, రెండో ట్రైలర్ కూడా దింపడానికి చాలా కారణాలున్నాయి. డీజే తొలి ట్రైలర్ అటు ఫ్యాన్స్‌కి గానీ, ఇటు సాధారణ ప్రేక్షకుడికి గానీ అనుకొన్నంత కిక్ తీసుకురాలేకపోయింది. ట్రైలర్ మరీ రొటీన్‌గా ఉండడం, అల్లు అర్జున్ బ్రాహ్మిణ్ స్లాంగ్ తప్ప, ఏ విభాగంలోనూ కొత్తదనం లేకపోవడంతో డీజే సినిమాపై `రొటీన్` అనే ముద్ర పడిపోయింది. దాన్ని చెరిపివేయడానికి రెండో ట్రైలర్‌పై ఆధారపడింది చిత్రబృందం. పైగా... ఆడియో ఫంక్షన్ జరిపేనాటికే డీజేలోని సగం పాటలు బయటకు వచ్చేశాయి. రెండు పాటల కోసం ఫంక్షన్ చేయడం ఎందుకు?? అందుకే... రెండు కొత్త పాటలతో పాటు, ట్రైలర్‌ని చూపించింది చిత్రబృందం. అయితే... రెండో ట్రైలర్ కూడా అంతంతమాత్రంగానే ఉండడం, బన్నీ బ్రాహ్మిణ్ స్లాంగ్ తప్ప మరేం కనిపించకపోవడం... అభిమానుల్ని మరింత ఆశ్చర్యపరిచాయి. ఈ ట్రైలర్లో అయినా అదిరిపోయే పంచ్ డైలాగ్ విందామని, కళ్లు చెదిరే బన్నీ స్టెప్పు చూద్దామని ఆశపడినవాళ్లకి నిరాశ కలిగించింది. దీనికంటే మొదటి ట్రైలరే బాగుందేమో..!
Also Read