బిగ్ బాస్ హౌస్లో ప్రతిరోజూ భారంగానే గడిచిందంటున్న సూర్యకిరణ్!
on Sep 15, 2020
'బిగ్ బాస్'లో ఉన్న వాళ్లంతా చాలా తెలివైన వాళ్ళనీ, తనకు అన్ని తెలివితేటలు లేవని షో నుండి మొదటి వారమే బయటకు వచ్చిన కంటెస్టెంట్ సూర్యకిరణ్ చెబుతున్నారు. అందరూ ఓవర్ ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నారని ఆయన అంటున్నారు. కంటెస్టెంట్లు అందరి నవ్వు దగ్గరనుంచి హావభావాలు అన్నీ ఆర్టిఫిషియల్ అని ఆయన తేల్చేశారు. అక్కడ మంచి చెబితే వినే వాళ్ళు లేరన్నారు.
'బిగ్ బాస్'లో ఓవర్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన వాళ్లను మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారని తెలిసిందనీ, అందుకే కంటెస్టెంట్లు అందరూ ఓవర్ చేస్తున్నారేమోనని సూర్యకిరణ్ అభిప్రాయపడ్డారు. షోలో ఉన్న వారం రోజుల్లో ప్రతిరోజూ తనకు భారంగా గడిచిందని తెలిపారు. మూడు నాలుగు వారాలు షోలో ఉందామని 'బిగ్ బాస్'కి వెళ్లినప్పటికీ మొదటి వారమే బయటకు వచ్చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
డబ్బు కోసం 'బిగ్ బాస్'కి వెళ్లలేదని సూర్యకిరణ్ చెప్పుకొచ్చారు. దర్శకుడిగా తనకు కొంత గ్యాప్ రావడంతో అందరికీ తెలియడం కోసం ఆ షోలో అడుగు పెట్టానని అన్నారు. ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని అన్నీ సిద్ధం చేసుకున్నాక కరోనా వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని సూర్యకిరణ్ స్పష్టం చేశారు.
Also Read