శంకర్ అలా చేశాడా..?
on Nov 1, 2016
శంకర్..హై బడ్జెట్ మూవీలకు, భారీ తనానికి కేరాఫ్ అడ్రస్. తనదైన టేకింగ్ తో భారతీయ సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లి ఇండియన్ స్పీల్ బర్గ్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో గతంలో తీసిన రోబోకు సీక్వెల్ గా రోబో 2.0 రూపొందిస్తున్నాడు శంకర్. ఆ సంగతి పక్కన బెడితే శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానముంది. ఆయన పాటల పిక్చరైజేషన్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. కేవలం పాటల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ట్రాక్ రికార్డు శంకర్ సొంతం.
అలాంటిది ఈసారి రోబో 2.0 విషయంలో మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదట. ఎందుకంటే రజనీ, అమీ జాక్షన్ మధ్య ఒక్క డ్యూయెట్ మాత్రమే ఉంటుందట. ఆ సాంగ్ ని ఉక్రెయిన్ లో ఇంతవరకూ ఎవ్వరూ తీయని చోట చిత్రీకరించారట. సినిమాలో ఆ ఒక్క పాత్ర మాత్రమే ఉంటుందట..కానీ ఆల్బమ్ లో మాత్రం ఐదారు పాటలు ఉంటాయట. సినిమా లెంగ్త్ ఎక్కువతుందనో లేదా మరేదైనా కారణమో కానీ శంకర్ ఈ డిసెషన్ ఎందుకు తీసుకున్నాడో అంతుపట్టక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.