ఆ విఎఫ్ ఎక్స్ వారు హ్యాండిచ్చారు-శంకర్
on Nov 27, 2018
ఫస్ట్ సినిమాను లాస్ట్ ఇయరే రిలీజ్ కు ప్లాన్ చేశాం. కానీ, ఒక విఎఫ్ ఎక్స్ కంపెనీ మెదట రెండు నెలల్లో వర్క్ ఫినీష్ చేసి ఇస్తామని మొదట ప్రామిస్ చేశారు. కానీ దుబాయ్ లో మేము మా సినిమాకు సంబంధించిన ఫంక్షన్ చేస్తుండగా వచ్చి విఎఫ్ ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఆరు నెలలు టైమ్ కావాలి అన్నారు. ఆ తర్వాత మరో ఆరు నెలలు కావాలన్నారు. ఇలా టైమ్ పొడిగిస్తూ వెళ్తున్నారు తప్ప వర్క్ మాత్రం ఇవ్వట్లేదు. అప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే...ఆ విఎఫ్ ఎక్స్ వారు గతంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేయలేదని. అందులో మా సినిమాలో చాలా కాంప్లికేటెడ్ విఎఫ్ ఎక్స్ ఉన్నాయి. ఇక వారి వల్ల కాదని వారి దగ్గర నుంచి మొతం ప్రాజెక్ట్ తీసుకుని దానికన్నా పెద్ద కంపెనీకి ఇచ్చాము. అక్కడ నేను ఏ విధంగా అయితే అనుకున్నానో ఆ విధంగా వచ్చింది సినిమా. అందుకే బడ్జెట్ పెరిగింది. సినిమా ఇంత కాలం డిలే అయింది. అయినా కానీ విఎఫ్ ఎక్స్ పరంగా ఇప్పుడు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను.