అల్లు అర్జున్ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
on Jul 13, 2020
గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్‌కి కథ చెప్పి, కన్ఫర్మేషన్ తీసుకోవడం అంత వీజీ కాదని రైటర్స్ అండ్ డైరెక్టర్స్ చెప్పే మాట. తమిళ దర్శకుడు లింగుస్వామితో అల్లు అర్జున్ తెలుగు-తమిళ బైలింగ్వల్ సినిమా అనౌన్స్ చేసి తరవాత పక్కన పెట్టేశాడు. 'ఇష్క్', 'మనం' సినిమాలు తీసిన విక్రమ్ కె కుమార్ చాలా రోజులు అల్లు అర్జున్ చుట్టూ తిరిగి చివరకు నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమా తీశాడు. ఈ లిస్టులో ఇంకొంత మంది డైరెక్టర్స్ ఉన్నారు. అందుకని, కొత్తగా అల్లు అర్జున్ హీరోగా మహి వి. రాఘవ్ డైరెక్షన్లో సినిమా అని చక్కర్లు కొడుతున్న న్యూస్ చూసి 'అల్లు అర్జున్ అతడికి ఛాన్స్ ఇస్తాడా?' అనే సందేహాలు వస్తున్నాయి.
'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' సినిమాలతో మహి వి. రాఘవ్‌కి దర్శకుడిగా పేరొచ్చింది. అయితే, ఆ రెండూ కమర్షియల్ సినిమాలు కాదు. 'ఆనందో బ్రహ్మ' కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం అయితే, 'యాత్ర' ఒక ఎపిసోడ్ బేస్ చేసుకుని తీసిన సినిమా. లో బడ్జెట్ ఫిలిమ్స్. అల్లు అర్జున్ వంటి స్టార్ అయితే బడ్జెట్ భారీగా ఉంటుంది. అది పక్కన పెడితే... స్టార్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది కీ ఫ్యాక్టర్. టెక్నికల్ పాయింట్స్ కంటే హీరోయిజమ్ చూపిస్తూ ఎలివేషన్స్ తీయడం ఇంపార్టెంట్. అందుకని, జనాలు డౌట్ పడుతున్నారు. అయితే, పీవీపీకి మహి వి. రాఘవ్ ఓ సినిమా కమిట్ అయ్యారట. ఒక పొలిటికల్ థ్రిల్లర్ సబ్జెక్టు చెప్పగా... బన్నీకి అయితే బాగుంటుందని పీవీపీ సజెస్ట్ చేశారట. బన్నీ లైన్ విని నచ్చిందని చెప్పినట్టు గుసగుస. కరోనా తగ్గి మళ్లీ షూటింగులు మొదలైతే... అల్లు అర్జున్ ముందు 'పుష్ప', ఆ తరవాత 'ఐకాన్' కంప్లీట్ చేయాలి. మహి వి. రాఘవ్ సినిమా ఆ తరవాత సంగతి.