జోడీ ఫిక్స్... డైరెక్టర్ ఛేంజ్
on Jan 22, 2021
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఓ హారర్ మూవీలో నటించబోతోందంటూ కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న సదరు సినిమాలో ఆమెకి జోడీగా మల్టిటాలెంటెడ్ ప్రభుదేవా నటిస్తాడని కూడా వినిపించింది. కట్ చేస్తే.. ఇప్పుడా సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడిందని కోలీవుడ్ బజ్.
ఆ స్థానంలో.. లక్ష్మణ్ దర్శకత్వంలో ఈ ఇద్దరు మరో చిత్రం చేయబోతున్నారట. ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ అని సమాచారం. సో.. డైరెక్టర్, జోనర్ ఛేంజ్ అయినా ఈ జోడీ మాత్రం ఫిక్స్ అన్నమాట. మరి.. ప్రభుదేవా, కాజల్ ఫస్ట్ కాంబినేషన్ ఏ స్థాయిలో మురిపిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సోషల్ డ్రామా మే నెలలో విడుదల కానుంది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న రాధే కూడా మే నెలలోనే సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.