బాబికి ఎన్టీఆర్ పిలుపు??
on Oct 29, 2016
జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ కి కన్ఫ్యూజన్ ఎక్కువైంది. తరవాత ఏ సినిమా చేయాలి, ఎవరితో చేయాలి? అనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అయితే ఈలోగా తనకు అందుబాటులో ఉన్న ఛాయిస్లన్నీ ఓసారి పరీక్షిస్తున్నాడు. తన కోసం కథలు సిద్దం చేసుకొన్న దర్శకుల్ని పిలిపించి... కథలు వింటున్నాడు. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ నుంచి చాలామంది దర్శకులకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. వాళ్లలో బాబి కూడా ఒకడు. పవర్ తో దర్శకుడిగా తన స్టామినా నిరూపించుకొన్నాడు బాబి. ఆ తరవాత పవన్ కల్యాణ్‌తో తీసిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ అవ్వడంతో దిగాలు పడ్డాడు. రవితేజతో ఓ సినిమా చేయాల్సివుంది. అయితే ఎందుకనో ఆ సినిమా పట్టాలెక్కడం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ పిలుపు అందుకొని... తన కోసం ఓ కథ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. కథ మరీ నచ్చితే ఏ దర్శకుడితో అయినా సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిద్దంగా ఉన్నాడట. సో.. ఇప్పుడు బంతి.. బాబి కోర్టులో ఉంది. అదిరిపోయే కథ చెప్పాల్సిన బాధ్యత తనదే. మరి బాబి ఏం చేస్తాడో చూడాలి.