ప్రెస్టేజ్ కోసం.. ఫ్లాప్‌ని బ్లాక్‌బస్టర్ అన్నాడా..?
on Dec 26, 2017
హారీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన డీజే సినిమా హిట్టా..? ఫట్టా అనే దానిపై ప్రేక్షకుల్లో క్లారిటీ లేదు. మొదటి వారంలోనే వందకోట్లను సాధించినట్లు చిత్ర యూనిట్ గొప్పగా ప్రచారం చేసుకోవడంతో.. బన్నీ అభిమానులు జబ్బలు చరిచారు.. తీరా అవన్నీ గాలి లెక్కలే అని తేలడంతో సైలెంట్ అయిపోయారు. విడుదలైన ఇన్ని రోజుల తర్వాత మళ్లీ డీజే వార్తల్లో నిలిచింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సంవత్సరం ఆరు సినిమాలు నిర్మించి మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు హాజరైన బన్నీ మాట్లాడుతూ.. ఒకే ఏడాదిలో ఐదు హిట్లు.. ఒక బ్లాక్‌బస్టర్ ఇచ్చిన నిర్మాత దిల్‌రాజు అన్నాడు.. అంటే అర్జున్ దృష్టిలో తను నటించిన డీజే బ్లాక్‌బస్టర్ కాగా.. మిగిలిన ఐదు సినిమాలు హిట్లు అన్నమాట. అయితే డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిన సినిమా బ్లాక్‌బస్టర్ ఎలా అవుతుంది అంటున్నారు సినీజనాలు. డీజే సినిమాకు బయ్యర్లు లాస్ అయ్యారని.. వాళ్లను ఫిదాతో ఆదుకున్నానని ఇటీవల నిర్మాత దిల్‌రాజు సూటిగా సుత్తి లేకుండా చెప్పేసారు. అంటే ప్రొడ్యూసరే స్వయంగా నా సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నట్లు తేలిపోయింది.
మరి అలాంటి సినిమాను బ్లాక్‌బస్టర్ అని బన్నీ ఎలా అంటాడు అంటే.. దీనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి.. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒక్కడు.. సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్తున్న నటుడు. మరి అటువంటి వ్యక్తి తన సినిమా ఫ్లాప్ అంటే ఆయన అభిమానులకు తలకొట్టేసినట్లే.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనే బన్నీ నోట బ్లాక్‌బస్టర్ అన్న మాట వచ్చింది అంటూ ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.