దిల్ రాజు మాట నాని నిలబెడతాడా??
on Sep 25, 2018
అవును నాని కూడా రీమేక్ లు మొదలెట్టాడు. ఇటీ వల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక తమిళ సినిమాపై మనసు పడ్ద్డారట. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వెంటనే రీమేక్ హక్కులు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుటున్నారా? త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటిస్తోన్న `96` చిత్రం. దిల్ రాజుకు విపరీతంగా సినిమా నచ్చడంతో సుమార్ కోటి రూపాయలకు రీమేక్ రైట్స్ కొన్నట్లు సమాచారం. కేవలం నానిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసుకున్నాడట దిల్ రాజు.
నాని నటించిన దేవదాస్ చిత్రం ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత `జెర్సీ` చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో త్వరలో సెట్స్ పెకి వెళ్లనుంది. ఇలాంటి సమయంలో మరి దిల్ రాజు రీమేక్ సినిమాలో నాని నటిస్తాడా? దిల్ రాజు మాట నిలబెడతాడా లేదా అన్నది సందేహం. ఇక ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తోన్న 96 చిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రాపర్ గా నటిస్తున్నాడు. 1996 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది.