బాలీవుడ్ బాటలో దిల్ రాజు!!
on Jul 24, 2019
ఇప్పటికే బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్స్ అప్ కమింగ్ ప్రొడ్యూసర్స్ తో కొలాబిరేట్ అవుతూ న్యూ ఏజ్ స్క్పిప్ట్స్ తో సినిమాలు తీస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. ఆ ఇన్ స్పిరేషన్ తో ఇప్పుడు హిట్ చిత్రాల నిర్మాతగా టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న దిల్ రాజు కూడా అప్ కమింగ్ ప్రొడ్యూసర్స్ కొంత మందితో కొలాబిరేట్ అవుతూ ఇక పై సినిమాలు నిర్మించడానికి పూనుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ వి సి బేనర్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...`` మా డిస్ర్టిబ్యూటర్ గా 1999లో మా జర్నీ ప్రారంభమైంది. పెళ్ళిపందిరి` సినిమా సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ గా పేరు తెచ్చింది. ఇక నిర్మాతగా 16 ఏళ్లు అవుతుంది. మా సంస్థలో రూపొందిన సినిమాల్లో అధిక భాగం సక్సెస్ లే ఉన్నాయి.
ఈ క్రమంలో మా సంస్థను ఇంకా స్ర్పెడ్ చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగానే అప్ కమింగ్ ప్రొడ్యూసర్స్ , కొత్త ప్రొడ్యూసర్స్ ఇలా మా తో అసోసియేట్ అయ్యేవాళ్ల సినిమాల స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు సపోర్ట్ చేస్తాం. అప్ కమింగ్ అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలా అసోసియేట్ అవుతున్నాం.కొత్త స్ర్కిప్ట్ తో వస్తే కచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఇదొక కొత్త ట్రావెల్. ఇండస్ట్రీకి మంచి సినిమాలివ్వాలన్న ప్రయత్నంలో భాగమే ఇది అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇప్పటికే సీనియర్ నిర్మాత కృష్ణప్రసాద్ , మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలను నిర్మించిన రాహుల్, యాత్ర నిర్మాత విజయ్, సినిమా చూపిస్తామావ నిర్మాత బెక్కం వేణుగోపాల్, కృష్ణ ఇలా కొంతమంది యంగ్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజుతో కొలాబిరేట్ అయ్యారు. నిజంగా ఇది మంచి ప్రయత్నమే అయినా చూద్దాం మరి దిల్ రాజు ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో, ఏంటో.
Also Read