సమంత తప్పు చేసిందా?
on May 29, 2020
పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కాలేదని, కావాలని సమంత మీద ఆమె సెటైరికల్ పోస్ట్ చేసిందని అక్కినేని కోడలి అభిమానులు ఆరోపిస్తున్నారు. అందులో నిజమెంత? అనేది పక్కన పెడితే... సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. గురువారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ఈ రచ్చ నడుస్తోంది.
పూజా హెగ్డే తప్పు చేసిందా? లేదా? అన్నదానికంటే పూజా హెగ్డే విషయంలో సమంత వ్యవహరించిన తీరు ఏమంత ఆమోదయోగ్యంగా లేదనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత, దర్శకురాలు నందినిరెడ్డి, గాయని-డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఓ పోస్ట్ కింద పెట్టిన కామెంట్లలో పరోక్షంగా పూజా హెగ్డే మీద కామెంట్లు చేశారు.
"సమంత.... నిన్ను మేం ప్రేమిస్తాం" అని నందినిరెడ్డి ఒక పోస్ట్ పెట్టారు. సమంత 'ఐ లవ్యూ' అని కామెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చారు. మధ్యలో చిన్మయి వచ్చి 'నన్ను కూడా లవ్ చెయ్. నా అకౌంట్ హ్యాక్ కాలేదు' అని కామెంట్ చేశారు. పూజా హెగ్డే మీద సెటైర్ అన్నమాట. అందుకు నందినిరెడ్డి 'నీ అకౌంట్ హ్యాక్ కావాలంటే నువ్వు చెడ్డ వ్యక్తివి కావాలి' అని అన్నారు. 'మళ్లీ చెప్పే వరకు హ్యాకింగ్ మీద జోక్స్ సస్పెండ్ చేశాం' అని సమంత కామెంట్ చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో పూజా హెగ్డేని టార్గెట్ చేశారు. దాంతో ఆమె అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు కోపం తెప్పించింది.
"వుయ్ సపోర్ట్ పూజా హెగ్డే" హ్యాష్‌ట్యాగ్‌తో సమంత, నందినిరెడ్డి, చిన్మయి వ్యవహరించిన తీరుని ప్రేక్షకులు ఎండగడుతున్నారు. కొందరు లేడీ మాఫియాతో పోలుస్తున్నారు. దీనిపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాయలేని భాషలో తిట్టడాన్ని ఆమె పాయింట్ అవుట్ చేస్తున్నారు.