English | Telugu

నాగ్ భార్యగా బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్!

on Jan 24, 2020

అక్కినేని నాగార్జున టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను బాలీవుడ్ పాపులర్ తార దియా మీర్జా చేస్తుండటం విశేషం. ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదనీ, పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రనీ, ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తున్న నమ్మకంతో ఆమెను తీసుకున్నామనీ చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అతి త్వరలోనే దియా మీర్జా పాల్గొనే సన్నివేశాలు మొదలు కానున్నాయి.

ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే. అందులో రీసెంట్‌గా జ‌రిగిన దిశ హంత‌కుల‌ ఎన్‌కౌంట‌ర్‌ను గుర్తుకు తెచ్చేలా నాగార్జున్ లుక్ ఉంది. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ పాత్ర‌లో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారనీ, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందనీ చిత్ర బృందం తెలిపింది. షానియల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకు డేవిడ్ ఇస్మాలోన్ యాక్షన్ డైరెక్టర్. 

2000 సంవత్సరంలో మిస్ ఇండియా అయిన దియా స్వస్థలం హైదరాబాదే. ముంబైలో సెటిల్ అయిన ఆమె కొంత కాలం క్రితంవరకు బాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్‌గా రాణించింది. 2014లో బిజినెస్‌మ్యాన్ సాహిల్ సంఘాను పెళ్లాడిన ఆమె 2019 ఆగస్టులో అతని నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. 'వైల్డ్ డాగ్'లో ఆమె నాగార్జున భార్యగా కనిపిస్తుందని వినికిడి.


Cinema Galleries



Latest News


Video-Gossips