ఎన్టీఆర్ సినిమాపై చరణ్ ఫ్రెండ్ కామెంట్స్..
on Jan 9, 2017
ధ్రువ సినిమాలో హీరో రామ్‌చరణ్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో బాగా తెలిసిన వ్యక్తి..అలాగే సినిమాలో మనల్ని ఎడిపించిన వ్యక్తి ఎవరంటే నవదీప్ అని చెప్పవచ్చు..మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లో నవదీప్ నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అదే నవదీప్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమాల ఎంపిక విషయంలో తనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగాయని, ఆ తప్పులు చేయకుంటే ఇవాళ తన పరిస్థితి ఇంకోలా ఉండేదని..అందుకు ఉదాహరణగా బాద్షా సినిమాను చెప్పాడు..
ఆ సినిమాలో తాను చేసింది ప్రాధాన్యత లేని పాత్ర అని..ఆ పాత్ర నిజంగా నేను చేయాల్సిన అవసరం లేదని..ఎవరైనా చేయొచ్చని అన్నాడు. విలన్ పాత్రలకు బదులుగా ఆర్య-2లో చేసిన నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఓకే కానీ, బాద్షా లోని పాత్ర మాత్రం వెస్ట్ అన్నాడు. ఏ వ్యక్తికైనా గడచిన ప్రతిరోజూ ఓ పాఠం నేర్పిస్తుంది..దానిని గుర్తించి ఇంతకు ముందు చేసిన తప్పుల్ని మరలా చేయకపోవడమే తెలివైన పని అని..ఆ అనుభవం నేర్పిన పాఠంతో ముందుకు సాగుతానని చెప్పాడు నవదీప్.