నాగార్జున క్యారెక్టర్‌ను చంపేస్తున్నారట..!
on Jul 27, 2018
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ మరియు సి.ధర్మరాజు సమర్పణలో అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మల్టీస్టారర్ ‘దేవదాస్’చిత్రంలో నాగార్జున చేస్తున్న పాత్రను చిత్ర దర్శకుడు చంపేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
సినిమా మొత్తం కామెడీ ఎంటర్ టైనర్‌గా వుంటుంది అంటూ చెప్పుకోస్తున్న దర్శకనిర్మాతలు సడన్‌గా ఈ మల్టీస్టారర్‌లో నాగార్జున పాత్రని విషాదంతో ముగించక తప్పడంలేదా... మరి ‘దేవదాస్’చిత్రంలో నాగార్జున పాత్ర చనిపోవడం అంటే అక్కినేని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. అన్నట్లు నాగార్జున హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో కథా పరంగా నాగ్ పాత్ర మరణించి హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిన విషయమే. అప్పట్టో ‘దేవదాస్’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు సోలోగా వచ్చి సూపర్ డూపర్ హిట్ సాధించాడు. మరి ఇప్పుడు ‘దేవదాస్’అంటూ వస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.