రవితేజ భార్య ఎవరో తెలుసా?
on Apr 16, 2021
ఇటీవలి దాకా రవితేజ ఫ్యామిలీ గురించి కొద్దిమంది సన్నిహితులకు తప్పితే మిగతావారికి అంతగా తెలీదు. కొన్నాళ్ల క్రితం తన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడే అందరికీ ఆయన భార్యా పిల్లలు ఎలా ఉంటారో తెలిసింది. రవితేజ తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, భూపతిరాజు రాజగోపాలరాజు. తండ్రి ఫార్మసిస్ట్ అయితే తల్లి గృహిణి. రవితేజది అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ అభీష్టం ప్రకారం మేనమామ కూతురు కల్యాణిని వివాహం చేసుకున్నాడు. కల్యాణి తండ్రి రాజ్యలక్ష్మికి సొంత అన్నయ్య.
2002 మే 26 జగ్గంపేట (తూ.గో. జిల్లా)లో రవితేజ, కల్యాణిల పెళ్లి సందడి సందడిగా జరిగింది. డైరెక్టర్లు కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఆ పెళ్లికి వెళ్లారు. చిన్నప్పట్నుంచీ తెలిసిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, సినిమాల్లో బిజీగా తిరిగే కొడుకును బాగా చూసుకుంటుందనే అభిప్రాయంతో కల్యాణిని కోడలుగా చేసుకోవాలని రాజ్యలక్ష్మి అనుకున్నారు. కొడుకుతో ఇదే మాట చెప్పారు. అమ్మ అంటే ప్రాణప్రదంగా భావించే రవితేజ మరో మాట లేకుండా ఓకే అనేశాడంట.
రాజ్యలక్ష్మి నమ్మకాన్ని కల్యాణి వమ్ము చేయలేదనేది సన్నిహితుల మాట. రవితేజ వ్యవహార శైలి, ముక్కుసూటి మనస్తత్వం తెలిసింది కావడంతో అతడికి తగ్గట్లు తనను తాను మలచుకుంది. షూటింగ్ నుంచి వచ్చే భర్తకు ఇంట్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ వస్తోంది. రవితేజ సైతం కల్యాణిని అంతే ప్రేమగా చూసుకుంటాడని అంటారు.
ఆ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు.. అమ్మాయి మోక్షద, అబ్బాయి మహాధన్. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'రాజా ది గ్రేట్'లో చిన్నప్పటి రవితేజగా మహాధన్ నటించాడు. 2006లో పుట్టిన మహాధన్ ప్రస్తుతం చదువు మీద శ్రద్ధపెట్టాడు. చదువు పూర్తయ్యాక హీరో కావాలనేది అతడి కోరిక.
Also Read