లుంగీ డ్యాన్స్ తో సందడి చేసిన దీపిక, విన్ డీజెల్..
on Jan 13, 2017
బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న దీపిక పదుకొణే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ‘ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషలలో కూడా ఉంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా.. హీరో విన్ డీజెల్, దర్శకుడు డీజె కరుసో నిన్న ముంబైకి వచ్చారు. అంతేకాదు ఈ సినిమా ప్రీమియర్ షో నిన్న వేశారు. ఈ ప్రీమియర్ షోలో విన్ డీజెల్, దీపికలు లుంగీ డ్యాన్స్ తో సందడి చేశారు. ఈ షోకి దీపిక, వీన్ డీజెల్ , కరుసోలతో పాటు రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, కల్కి కొచ్చిన్, నీల్ నితీష్ ముకేష్, ఇర్ఫాన్ ఖాన్,హుమా ఖురేషీ, కృతి సనన్ , రిచా చద్దా తదితరులు హాజరయ్యారు.
కాగా ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో మూడో భాగంగా వస్తోన్న ట్రిపుల్ ఎక్స్ 3 చిత్రంలో టోనీజా, శామ్యూల్ జాక్సన్, టోని కొలెట్, నినా డొబ్రెవ్, రూబీ రోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తోండగా దీపిక సెరీనా ఉంగర్ అనే పాత్ర పోషించింది.