ENGLISH | TELUGU  

'అంజ‌లి అంజ‌లి' క‌వ‌ర్‌ సాంగ్‌.. అల్లు అర్హ క్యూట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌!

on Nov 22, 2020

 

క్యూట్‌నెస్ అన్‌లిమిటెడ్‌.. 'అంజ‌లి అంజ‌లి' క‌వ‌ర్ సాంగ్‌లో అల్లు అర్హ‌ను చూస్తే అనిపించే అభిప్రాయం ఇది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ ముద్దుల త‌న‌య అర్హ ప‌ర్ఫార్మెన్స్ చూస్తే.. పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్లు అనే నానుడికి అచ్చ‌మైన నిద‌ర్శ‌నం అనిపించ‌క మాన‌దు. న‌ట‌న త‌న జీన్స్‌లోనే ఉన్న‌ట్లు 'అంజ‌లి అంజ‌లి' సాంగ్‌లో అంత ముచ్చ‌ట‌గా, అంత స‌హ‌జంగా అభిన‌యం చూపించి అబ్బుర‌ప‌ర‌చింది అర్హ‌. మూడు నిమిషాల పాట‌లో అర్హ‌కు సంబంధించి ఎన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయో! త‌ను క‌నిపించే ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ అర్హ మ‌న‌ల్ని త‌న ప్రేమ‌లో ప‌డేట్లు చేస్తుంద‌నడంలో అతిశ‌యోక్తి ఏమాత్రం లేదు.

అర్హ నాలుగో బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె అభిన‌యించిన అంజ‌లి అంజ‌లి క‌వ‌ర్ సాంగ్‌ను శ‌నివారం రాత్రి త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు బ‌న్నీ. "Happy Birthday My lil ARHA ! We shot a memorable video re creating the classic Anjali with my Daughter Arha . I wanted to share it with all my the well wishers . Hope you like it like we did." అని ఆయ‌న రాసుకొచ్చాడు.

అర్హ న‌వ్విందంటే అపురూపం.. అర్హ అమాయ‌కంగా చూసిందంటే అద్భుతం.. అర్హ ఆడిందంటే అబ్బురం.. మ‌ణిర‌త్నం మాస్ట‌ర్ పీస్‌ 'అంజ‌లి' (1990)లోని టైటిల్ సాంగ్‌లో బేబి షామిలి న‌ట‌న చూసి ఎంత అబ్బురానికి గుర‌య్యామో.. ఇప్పుడు బేబీ అర్హ న‌ట‌న‌కూ అంతే ఆశ్చ‌ర్యానికి గుర‌వుతాం. ఇళ‌య‌రాజా స్వ‌రాలు, మ‌ధు అంబ‌ట్ ఛాయాగ్ర‌హ‌ణం, మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వెర‌సి 'అంజ‌లి అంజ‌లి' సాంగ్ క్లాసిక్ హిట్ సాంగ్‌గా నిలిచింది. అర్హ‌తో తీసిన క‌వ‌ర్ సాంగ్‌కు గ‌ణేశ్ స్వామి కొరియోగ్ర‌ఫీ అందించ‌గా, సూర్య కెమెరా అర్హ పెర్ఫార్మెన్స్‌ను, ఆమెలోని క్యూట్‌నెస్‌ను సూప‌ర్బ్‌గా క్యాప్చ‌ర్ చేసింది. మ‌ధు ఎడిటింగ్ కూడా టాప్ క్లాస్‌లో ఉంది. సాయిగోపాల్ రామ‌మూర్తి రూపొందించిన ఈ క‌వ‌ర్ సాంగ్‌ను అల్లు అర్జున్ స్వ‌యంగా ప్రెజెంట్ చేశాడు.

అన్న‌ట్లు.. ఈ సాంగ్‌లో అర్జున్ కూడా చివ‌ర‌లో క‌నిపించి, అర్హ‌ను ఎత్తుకొని ముద్దాడాడు. పాట మొత్తం అర్హ అన్న‌య్య అయాన్ కూడా (ఒరిజిన‌ల్‌లో త‌రుణ్ త‌ర‌హాలో) క‌నిపించాడు. చెల్లిని ముద్దాడాడు, ఆమెను ఆడించాడు, స్నేహితుల‌తో క‌లిసి ఆమెతో ఆడాడు. అలాగే తాత‌య్య‌లు అల్లు అర‌వింద్‌, కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, చిరంజీవి తోడ‌ల్లుడు డాక్ట‌ర్ కె. వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా అర్హ‌తో మూమెంట్స్ పంచుకున్నారు. మొత్తానికి త‌న‌లో మంచి న‌టి ఉంద‌ని నాలుగో పుట్టిన‌రోజుకే నిరూపించేకుంది అర్హ‌. త్వ‌ర‌లో ఆమె బాల న‌టిగా సినిమాల్లో క‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

- YM


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.