English | Telugu

అరవింద సమేతకు షాక్.. సినిమాను అడ్డుకుంటాం

on Oct 15, 2018

 

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం దసరా కానుకగా ఈ నెల 11 న విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే అనుకోకుండా అరవింద సమేతకు ఒక షాక్ ఎదురైంది. ఈ చిత్రంలో రాయలసీమకు సంబంధించిన పలు అభ్యంతరకమైన సీన్లు, మాటలున్నాయని.. వెంటనే వాటిని తొలగించకుంటే అరవింద సమేతను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ పోరాట సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ఈ సినిమా ద్వారా రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రాయలసీమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here