నో డౌట్... సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్'
on Apr 4, 2020
'ఆర్ఆర్ఆర్'లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించట్లేదన్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా నుండి తప్పుకుందని కొందరు కథలు అల్లేశారు. అయితే... ఒక్క ట్వీట్‌తో ఆమె పుకార్లకు చెక్ పెట్టింది. 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ ట్వీట్ చేయడంతో తాను సినిమాలో ఉన్నట్టు ఆలియా భట్ స్పష్టం చేసింది. రాజమౌళితో సినిమాకి ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్ ఇస్తాననీ, టెన్షన్ పడవద్దనీ, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ముందు 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేస్తానని మాట ఇచ్చిందట.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మే నెలాఖరున లేదా జూన్ తొలి వారంలో 'ఆర్ఆర్ఆర్' షూటింగులో ఆలియా భట్ పాల్గొంటుందని తెలిసింది. మే నెలాఖరున పుణె షెడ్యూల్ లో ఆలియా జాయిన్ కావచ్చని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. నిజానికి, ఏప్రిల్ 15 నుండి ఆలియా డేట్స్ తీసుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆల్రెడీ సినిమా గ్రాఫిక్ వర్క్స్ చాలావరకూ పూర్తయ్యాయని, ముందుకు ప్రకటించినట్టు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న సినిమాను విడుదల చేస్తామని కాన్ఫిడెంట్ గా దానయ్య చెప్పారు.
Also Read