కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ!
on Nov 24, 2020
కలర్స్ స్వాతిగా మనందరికీ సుపరిచితురాలైన స్వాతి 2018లో మలయాళీ అయిన తన ప్రియుడు వికాస్ వాసును పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వికాస్ ఒక పైలట్. పెళ్లి తర్వాత నటనకు తాత్కాలికంగా వీడ్కోలు చెప్పి, భర్తతో పాటు ఇండోనేసియా వెళ్లిపోయారు స్వాతి. ఇప్పుడామె హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. నటనలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.
అవును. తనకెంతో ఇష్టమైన నటనను కొనసాగించాలని ఆమె భావిస్తున్నారు. అభినయానికి అవకాశం ఉన్న బలమైన పాత్రల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఆషామాషీ పాత్రలు కాకుండా జనం మెచ్చే పాత్రలను చేయడానికే ఆమె మొగ్గుచూపుతున్నారు.
ఇప్పటికే ఓ వెబ్ డ్రామాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయనీ తెలుస్తోంది. కృష్ణవంశీ చిత్రం డేంజర్ ద్వారా టెలివిజన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన స్వాతి, ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ చిత్రాల ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
