చిరు సినిమా బాహుబలి రేంజులో...
on Mar 18, 2017
ఖైదీ నెం.150తో కొత్త రికార్డులు లిఖించి, తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకొన్నాడు చిరంజీవి. ఇప్పుడు అందరి కళ్లూ చిరు చేయబోయే 151వ సినిమాపైనే. ఈ సినిమా ఎలా ఉంటుందా?? ఎప్పుడు మొదలవుతుందా?? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిరు 151వ సినిమాకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ దాదాపుగా పూర్తయిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారం కూడా బయటకు వచ్చేసింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చిరు 151వ చిత్రంగా రాబోతున్న సంగతి తెలిసిందే. దానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు ఖాయమైంది.
ఈ సినిమాకి చిరు బాహుబలి రేంజులో తీయాలని ఫిక్సయ్యాడట. ఎందుకంటే ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. ఓ స్వాతంత్య్ర సమరయోధుడి కథ. యుద్దాలకు ప్రాధాన్యం ఉంది. అందుకోసం విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడబోతోంది చిత్రబృందం. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో తీయాలని, అందుకోసం ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదని చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమాలో కొంతమంది బాలీవుడ్ నిపుణుల్ని టీమ్ లోకి తీసుకోబోతున్నాడని, కాస్ట్యూమ్స్, సెట్స్, కెమెరా ఇలా కీలకమైన విభాగాలకు సంబంధించి బాలీవుడ్లో పేర్గాంచిన సాంకేతిక నిపుణులు పనిచేస్తారని, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం హాలీవుడ్ రేంజులో ఉండబోతున్నాయని సమాచారం. సో.. చిరు 151 ఓ రేంజ్లో ఉంబబోతోందన్నమాట. టెక్నికల్‌గా ఈ సినిమా బాహుబలికి ఏమాత్రం పోటీ ఇస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.