మెగా 'లూసిఫర్' లైన్లోకి వీవీ వినాయక్?
on Jul 16, 2020
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఆయన స్టయిల్ తెలిసిన టాలీవుడ్ దర్శకులలో వీవీ వినాయక్ ఒకరు. చిరు హీరోగా రెండు రీమేక్స్ చేసి రెండుసార్లూ హిట్స్ కొట్టారు. ఒరిజినల్ కథలు తీసుకుని, వాటికి చిరంజీవి మెచ్చే విధంగా మార్పులు-చేర్పులు చేసి ప్రేక్షకులు మెచ్చే విధంగా తీశారు. అటువంటి వీవీ వినాయక్ చేతికి మెగా 'లూసిఫర్' రీమేక్ వస్తోందా? అవుననే ఫిలింనగర్ వర్గాల నుండి ఓ సమాధానం వినిపిస్తోంది. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ సుజీత్ చేతిలో పెట్టారు కదా! మళ్ళీ వినాయక్ అంటున్నారేంటి? అని సందేహం వచ్చిందా? అయితే, అసలు వివరాలలోకి వెళ్లాల్సిందే.
'సాహో' రిజల్ట్ తరవాత సుజీత్ కి సినిమా రావడానికి మరి కొన్ని రోజులు టైమ్ పడుతుందని అంతా భావించిన సమయంలో 'లూసిఫర్' రీమేక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. యంగ్ డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అతడు చేసిన మార్పుల పట్ల మెగాస్టార్ సంతృప్తిగా లేరట. అందుకని, వీవీ వినాయక్ పేరు లైనులోకి వచ్చిందని టాక్. అయితే, ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తారని, ఒరిజినల్ కథతో వినాయక్ మరో సినిమా చేస్తారని టాక్. ఏది నిజమో కొన్ని రోజులలో తెలుస్తుంది.
Also Read