'సైరా' ఫొటోలు లీక్... చిరు, నయన్ అదిరిపోయే లుక్స్..
on Mar 30, 2018
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద చిత్రాలకు మాత్రం లీకుల గోల తప్పట్లేదు. ఎంతో కేర్ ఫుల్ గా ఉండే రాజమౌళికే ఆ ఎక్స్ పీరియన్స్ అయింది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బీ కూడా సినిమా షూటింగులో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. అంతేకాదు... తాను షూటింగ్ లో పాల్గొనబోతున్నానని... ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ... తన లుక్ కు సంబంధించి ఓ ఫొటో కూడా బయటపెట్టారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు 'సైరా'కు చెందిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో చిరంజీవి, నయనతార ఓ యజ్ఞం నిర్వహిస్తున్నారు. పక్కనే గురువు అమితాబ్ ఈ మహా కార్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వెనుక బ్రహ్మాజీ నిలబడి ఉన్నాడు. ఇక ఆ చుట్టూ వందలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. అయితే ఈ ఫొటోలు ఎవరు తీశారో, ఎలా తీశారో తెలియదుగానీ, నెట్టింట మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. ఇక చిరంజీవి, నయనతార లుక్ విషయానికొస్తే.. చిరంజీవి వైట్ అండ్ మెరూన్ డ్రస్ లో పొడవాటి జుట్టు, గడ్డంతో ఉండగా, నయనతార బంగారు వర్ణపు దుప్పట్టా, పసుపు చీరతో కూర్చుని ఉంది. ఇద్దరి లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. మొత్తానికి భారీ బడ్డెత్ తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ ఫొటో చూస్తుంటే.. ఎక్కడా రాజీ పడట్లేదు అన్న విషయం మాత్రం అర్దమవుతోంది.