చిరంజీవి అల్లుడికి కరోనా నెగటివ్!
on Jul 12, 2020
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్‌కు టెస్టుల్లో కరోనా నెగటివ్ అని తేలింది. కొన్ని రోజులుగా అతను హీరోగా నటిస్తోన్న 'సూపర్ మచ్చి' షూటింగ్లో పాల్గొంటున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేయడంతో ఆ సినిమా నిర్మాతలు షూటింగ్‌ను పునఃప్రారంభించారు. షూటింగ్లో పాల్గొంటున్నప్పట్నుంచీ కుటుంబంతో కలవకుండా వేరుగా ఉంటున్న కల్యాణ్ దేవ్, షెడ్యూల్ పూర్తయ్యాక స్వీయ క్వారంటైన్లో గడిపి, స్వచ్ఛందంగా కొవిడ్-19 టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్టుల్లో తనకు నెగటివ్ వచ్చిందని అతను తెలిపాడు.
ఆ తర్వాత తన భార్య, పిల్లలను కలుసుకున్న అతను ఆ ఆనంద క్షణాలను సెల్ఫీలో బంధించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకున్నాడు. "షూటింగ్లో పాల్గొంటున్నప్పట్నుంచీ సెల్ప్-ఐసొలేషన్‌లో ఉంటూ వచ్చాను. ఆ తర్వాత కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నెగటివ్ అని వచ్చింది! నా గురించి శ్రద్ధ చూపించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మీ ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ బృందాన్ని కౌగలించుకోవడం కోసం ఎదురుచూస్తూ వచ్చాను" అంటూ రాసుకొచ్చాడు కల్యాణ్ దేవ్.
అతను హీరోగా నటిస్తోన్న రెండో సినిమా 'సూపర్ మచ్చి'. కన్నడ తార రచితా రామ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామాను పులి వాసు డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read