మెగాస్టార్ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అడ్డు...
on Feb 8, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ చకచకా జరుగుతోంది. దీనికి ‘ఆచార్య’ టైటిల్ దాదాపుగా ఖారారు చేసినట్టే. మొదట ‘గోవింద ఆచార్య’ అనుకున్నారు. చివరకు, ‘ఆచార్య’ అయితే బావుంటుందని అదే ఫిక్స్ చేశారట. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న స్పీడు చూస్తుంటే మరో రెండు మూడు నెలల్లో సినిమా కంప్లీట్ అవుతుంది. సమ్మర్లో రిలీజ్ చేయవచ్చు. సినిమా ఎప్పుడూ పూర్తయినా... రిలీజ్ మాత్రం నెక్ట్స్ ఇయర్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారట. అందుకు కారణం రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా!
చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ హీరో. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరో. ప్రజెంట్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు చిరంజీవి–కొరటాల శివ సినిమాలో రామ్చరణ్ ఓ రోల్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ స్ర్కీన్ మీద కనిపిస్తాడట. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ఈ సినిమా చేయడానికి రామ్చరణ్ ముందు రాజమౌళి ఒక కండిషన్ పెట్టాడట. తన సినిమా తర్వాత ఇంకో సినిమా విడుదల కావాలని! అందువల్ల, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యేవరకూ మెగాస్టార్ ‘ఆచార్య’ విడుదల కావడానికి వీల్లేదు. షూటింగ్ పూర్తయినా పక్కన పెట్టుకోవలసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతుంది. ఆ తర్వాత మంచి సీజన్ అంటే స్టూడెంట్స్కు ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత వచ్చే సమ్మరే. అందుకని, 2021 సమ్మర్లో రావాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారట. మధ్యలో మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది.