మెగా డాటర్... నిర్మాతగా వెబ్ సిరీస్
on Jul 8, 2020
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, 'సైరా నరసింహారెడ్డి', 'రంగస్థలం' సహా పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల ప్రొడక్షన్లోకి అడుగు పెడుతున్నారని తెలుగువన్ గతంలో చెప్పింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్‌కి క్లాప్ కొట్టారు.
జస్ట్, వెబ్ సిరీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు సుష్మితా కొణిదెల తెలిపారు. నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించలేదు. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించిన సుష్మితకు మెగా వారసులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అరవింద్ 'ఆహా' ఓటీటీలో కీలక భాగస్వామిగా ఉన్నారు. సో... వెబ్ సిరీస్ మార్కెటింగ్ విషయంలో సుష్మితకు ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. 'ఆహా'లో ఆ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.