సైకిలెక్కిన మెగాస్టార్ చిరంజీవి!
on Jun 28, 2016
హెడ్డింగ్ చదివి "చిరంజీవి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయాడా?" అని కంగారుపడిపోకండి. ఆయనేక్కించి తెలుగుదేశం పార్టీ ఓటు గుర్తు సైకిల్ కాదు, ముఠా మేస్త్రి సైకిల్. "ముఠా మేస్త్రి" సినిమాలో చిరంజీవి మార్క్ట్ కూలీగా నటించగా.. ఆ సినిమాలో ఆయన మాస్ గెటప్ లో సైకిల్ తొక్కుతూ వస్తుంటే జనాలకి ఈలలు వేయలేక బుగ్గలు నొప్పిపుట్టాయి. అలాగే.. "ఘరానా మొగుడు" సినిమాలోనూ సైకిల్ తొక్కి అలరించాడు. ఆ తర్వాత మెగాస్టార్ ను సైకిల్ మీద ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మొన్న ప్రసారమైన "సినిమా అవార్డ్స్" వేడుకలో మెగా రీఎంట్రీ సందర్భంగా డిజైన్ చేసిన స్పెషల్ ప్రోగ్రామ్ లో చిరంజీవి తన కెరీర్ లో గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో మరోమారు పరకాయ ప్రవేశం చేసి అభిమానులని మెప్పించడంతోపాటు, "చిరంజీవి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తాడు?" ప్రశ్నించినవారికి గట్టి సమాధానం ఇచ్చాడు. సదరు ప్రోగ్రామ్ లో చిరు రెపీట్ చేసిన గెటప్ లు అన్నిటికంటే సైకిల్ మీద చిరు నిల్చున్న స్టిల్ కు విశేషమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకు విపరీతమైన లైక్స్, షేర్స్ వస్తున్నాయి!