English | Telugu

హైద‌రాబాద్‌కి అక్కినేని ఫ్యామిలీ

on May 13, 2019

ఆల్మోస్ట్ అక్కినేని ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వస్తున్నట్టే. ఆల్రెడీ అక్కినేని యంగ్ కపుల్ నాగచైతన్య, సమంత హైదరాబాద్‌లో తమ ఇంటికి చేరుకున్నారు. స‌మ్మ‌ర్‌లో స్పెయిన్‌కి ట్రిప్ వేసిందీ జోడీ. అక్కడికి వెళ్లే ముందు సమంత పోర్చుగల్ వెళ్లారు. మామగారు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'మన్మథుడు 2'లో అతిథి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు. తరవాత భర్తతో కలిసి స్పెయిన్ చెక్కేశారు. ఆల్మోస్ట్ నెల రోజులు జరిగిన 'మన్మథుడు 2' పోర్చుగ‌ల్‌ షెడ్యూల్ పూర్తి కావడంతో నాగార్జున కూడా హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన సతీమణి కూడా. అమల అక్కినేని కూడా పోర్చుగల్ వెళ్లారు. 'మన్మథుడు 2' షూటింగ్ మధ్యలో కాస్త విరామం తీసుకుని ఆమెతో కలిసి పోర్చుగల్ చుట్టేశారు నాగార్జున. కొన్ని రోజులుగా విదేశాల్లో ఉంటున్న అక్కినేని సీనియర్ కపుల్, యంగ్ కపుల్... ఫ్యామిలీ అంతా హైద‌రాబాద్‌కి వచ్చారు. వస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ తో కలిసి టూర్ వెళ్లిన అఖిల్, ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. బహుశా... కొత్త సినిమా చర్చల్లో బిజీగా ఉన్నారేమో. 

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here