English | Telugu

'సాహో' కోసం స్పెషల్ కెమెరా!

on Jun 11, 2019

 

ప్రభాస్ 'సాహో' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. హీరో, హీరోయిన్ శ్రద్ధాకపూర్ పై పాటను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో పాటలు ఉండడం కామన్. అయితే ఈ సౌంగ్ స్పెషాలిటీ ఏంటంటే... BOLT కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఇండియాలో BOLT కెమెరా ఒక్కటంటే ఒక్కటే ఉంది. ‌ పాట కోసం స్పెషల్ గా దాన్ని తెప్పించారు. ఇంతకుముందు ఈ కెమెరాతో తెలుగు సినిమా షూటింగులేవీ జరగలేదు. bolt కెమెరాతో షూటింగ్ జరుపుకుంటున్న తెలుగు సినిమాలో సాహో కావడం విశేషం. కొన్ని హిందీ చిత్రాలు, హాలీవుడ్ సినిమాల కోసం ఈ కెమెరా ఉపయోగించారు. ‌సాహో సాంగ్ షూటింగ్ జరుగుతుందని శ్రద్ధా కపూర్ లీక్ అయితే ఇచ్చారు. కానీ, ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారు అనేది మాత్రం చెప్పలేదు. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్న తర్వాత సినిమాకు ఎవరు సంగీతం అందిస్తున్నారు అనేది సాహో బృందం అధికారికంగా వెల్లడించలేదు. గురువారం సాహో టీజర్ విడుదల అవుతుంది. ఆరోజు ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి. ఆగస్టు 15న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here