అల్లు కాంపౌండ్‌లోకి అడల్ట్ కంటెంట్!
on Apr 4, 2020
అల్లు అరవింద్ తీసిన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏవైనా కొన్ని కనిపించి ఉండొచ్చు. కొన్ని సరస సన్నివేశాలు కనిపించి ఉండొచ్చు. ఇంకొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా మనం చూసి ఉండొచ్చు. కానీ ఇప్పటిదాకా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తీసిన ఏ సినిమాలోనూ శ్రుతి మించిన సన్నివేశాలు కానీ, కంటెంట్ కానీ కనిపించలేదు. అంటే అరవింద్ నిర్మించిన సినిమాలన్నింటిలోనూ కంటెంట్ గొప్పగా ఉండకపోవచ్చు కానీ, నాసిరకంగా మాత్రం లేవనే పేరు ఉంది. ఇప్పుడు ఆ ఇమేజ్‌కు డామేజ్ కలిగే అవకాశం కనిపిస్తోంది.
అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆహా అనే స్ట్రీమింగ్ చానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంటేనే సెక్స్, క్రైమ్, వయొలెన్స్ ఎక్కువగా ఉండే కంటెంట్ కనిపిస్తుందనీ, యూత్‌ని టార్గెట్ చేసుకున్న కంటెంటే ఎక్కువగా ఉంటుందనీ అందరికీ తెలుసు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి చానల్స్‌లో మనకు కనిపించే కంటెంట్ ఎక్కువగా ఇదే. ఆహా చానల్ ప్రారంభించినప్పుడు చాలా మందికి ఈ తరహా సందేహాలే వచ్చాయి. కంటెంట్ విషయంలో అరవింద్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్ దృష్ట్యా ఆయన అలాంటి కంటెంట్ జోలికి వెళ్లకుండా ఆసక్తికరమైన కంటెంట్‌ను ఇస్తారని చాలామంది భావించారు
నిన్నటి దాకా ఆహాలో మనకు అలాంటి కంటెంట్ కనిపించలేదు. కానీ ఇప్పుడు అలాంటి కంటెంట్ వచ్చేసింది. తాజాగా ఆ చానల్లో సిన్ అనే వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది. ట్రైలర్ చూస్తేనే అది అడల్డ్ కంటెంట్ ఉన్న సిరీస్ అని అర్థమైపోయింది. ఏడు భాగాల ఈ సిరీస్‌లో ఓ భర్త.. పడకగదిలో భార్య తనకు సరిగా సహకరించడం లేదని బాధపడుతూ, ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం కనిపిస్తుంది. భార్యను ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా లొంగదీసుకోవడం, ఆ సమయంలో సంభాషణలు, ఆమె ఆక్రందనలు, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకూ, అతడికీ మధ్య బోల్డ్ సీన్లతో ఫుల్ మసాలా దట్టించి ఈ సిరీస్ తీశారు. జార్జిరెడ్డి మూవీలో విలన్‌గా నటించి, పలాస 1978లో హీరో అన్నగా మెప్పించి తిరువీర్ ఈ సిన్లో ప్రధాన పాత్ర పోషించగా.. అతని జీవితంలోని ఇద్దరు మహిళలుగా జెన్నిఫర్ పిక్సినాటో, దీప్తి సతి కనిపిస్తారు నవీన్ మేడారం డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read