ఈ భామకు భర్తంటే ఎంత నమ్మకమో..!
on May 30, 2016
గత కొంత కాలంగా హ్యాపీగా ప్రేమపక్షులుగా విహరించిన బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల ప్రేమకథ పెళ్లితో శుభం కార్డు పడింది. పెళ్లైన తర్వాత హనీమూన్ కు విదేశాలకు చెక్కేసిన బిపాషా రీసెంట్ గా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని, కరణ్ పై తన నమ్మకాన్ని మీడియాతో ముచ్చట్లలో చెప్పింది. ఇప్పటికే కరణ్ గ్రోవర్ కు మూడు పెళ్లిళ్లయిన విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, తాను మూడో భార్యను అయినందుకు ఎలాంటి బాధా లేదని, తనకు కూడా ఇద్దరితో బంధం విచ్చిన్నమైంది కదా అని ప్రశ్నిస్తోంది. నిన్ను కూడా వదిలేస్తాడేమో అన్న ప్రశ్నకు, ప్రపంచం మనిషిలోని తప్పుల్నే చూస్తుంది తప్ప, మంచి విషయాల్ని పట్టించుకోదు. ఆయన విషయంలో నాకు ఏం జరిగినా భయం లేదు. కరణ్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. నన్ను ఆయన ప్రాణంగా ప్రేమించారు అని చెబుతోంది. ఇంతకు ముందు జాన్ అబ్రహాంతో దాదాపు పెళ్ళి వరకూ వెళ్లిన బిప్స్ కు ఆ బ్రేకప్ తర్వాత పెళ్లంటేనే విరక్తి పుట్టేసిందట. అయితే ఎలాగో మళ్లీ కరణ్ గ్రోవర్ ప్రేమలో పడింది. భర్తపై ఇంత నమ్మకముంటే ఇక గొడవే లేదు అంటున్నారు బాలీవుడ్ జనాలు.