ENGLISH | TELUGU  

కంటెస్టెంట్లు అంద‌రినీ క్రిమిన‌ల్స్‌గా మార్చేసిన‌ బిగ్ బాస్‌!

on Sep 29, 2020

 

నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటిసభ్యుల్లో సోహైల్, అఖిల్ లను స్టోర్ రూం లో ఉన్న హిట్‌మ్యాన్‌ డ్రస్సులు ధరించాలని బిగ్ బాస్‌ ఆదేశించాడు. ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు, హిట్‌మ్యాన్‌కు ఐదువేల రూపాయలు ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగినప్పుడల్లా డెన్ లో ఉండే హిట్‌మెన్‌ వద్దకు ఒకరు వెళ్ళి హౌస్ లో ఒకరి పేరు చెప్పి, వారిని ఎందుకు చంపాలో కారణం చెప్పి డీల్ కుదుర్చుకోవాలి. హిట్‌మ్యాన్‌ వారిని చంపిన తర్వాత పదివేల రూపాయలు ఇవ్వాలి. ఇలా ఐదు సార్లు బజర్ మోగినప్పుడు ఐదుగురు నామినేట్ అవుతారు. చివరకు హిట్‌మెన్‌లో ఎవరి దగ్గర తక్కువ డబ్బులు ఉంటే వారు నామినేట్ అవుతారు. అయితే హౌస్ కెప్టెన్ గా ఉన్న గంగవ్వ, దేవి బిగ్ బాంబ్ లో సేఫ్ అయిన అరియానాను ఎవరూ నామినేట్ చేయవద్దని సూచిస్తూ నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ వివరించాడు.

డీల్ కుదుర్చున్న తర్వాత బజర్ మోగగానే అఖిల్ పిస్టల్ అందుకుని ఇంటిలోకి వెళ్ళి స్వాతి మెడలో నామినేటెడ్ అన్న ట్యాగ్ వేసి రాజశేఖర్ చెప్పిన కారణం  చెప్పి పిస్టల్ తో ఆమెను షూట్ చేశాడు. ఆ తర్వాత అభిజిత్ ను మోహబూబ్, లాస్యను అరియానా చంపాలని డీల్ చేసుకున్నారు. దాంతో అభిజిత్ ను, లాస్య‌ను అఖిల్ చంపాడు. మోహబూబ్  పేరును హారిక చెప్పగా అత‌డిని తుపాకీ ముందుగా అందుకున్న సోహైల్ చంపాడు. చివరి బజర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే నోయల్ హిట్ మెన్ డెన్‌ దగ్గర కాపు కాశాడు. బజర్ మోగగానే ఇంటిసభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చే లోగానే నోయల్ డెన్ లోకి వెళ్లాడు.  

కుమార్ సాయిని చంపాలని డీల్ చేసుకుంటున్న సమయంలో నోయల్ డెన్ లోకి లాన్ లో నుంచి వచ్చాడని, అది చెల్లదని కుమార్ సాయి అన్నాడు. బిగ్ బాస్ చేసిన సూచనలను మరోసారి చదివి వినిపించాడు. దాంతో నోయల్ ఎంట్రీ చెల్లలేదు. బజర్ మోగగానే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ ఫస్ట్ వచ్చిన సుజాతకు హిట్ మెన్ లతో ఢీల్ కుదుర్చుకునే అవకాశం వచ్చింది. సుజాత కూడా కుమార్ సాయి పేరే చెప్పడంతో కంటెస్టెంట్ మారినా నామినేషన్ మారలేదు అంటూ ఇంటిసభ్యులు నిట్టూర్చారు.

ఎవరితో కలవడం లేదు అని ఎన్నిసార్లు చెప్తారు, కొత్తగా ఎమైనా ఉంటే చెప్పండి అంటూ కుమార్ సాయి కామెంట్స్ చేశాడు. కుమార్ ను చంపే డీల్ అఖిల్ తీసుకున్నాడు. దాంతో ఈ మొత్తం డీల్ లో అఖిల్ నలుగిరిని చంపి 40వేలు సంపాదించాడు. సోహైల్ ఒకరిని చంపి పదివేలు తీసుకున్నాడు. తక్కువ వచ్చిన వాళ్ళు నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో అఖిల్  డీల్ అమౌంట్ లో కొంత సోహైల్ కొట్టేశాడు. సగంసగం పంచుకుందామని అఖిల్ తో అన్నాడు.  దాంతో అఖిల్ అదంతా ఏం లేదు.. గేమ్ గేమే అంటూ వారించాడు.

ఈ వారం ఏడుగురు.. మళ్ళీ కుమార్ సాయి
నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే హిట్ మెన్ ల్లో ఎవరికి ఎక్కువ డబ్బులు వచ్చాయో చెప్పమన్నాడు బిగ్ బాస్. అఖిల్ కు ఎక్కువ డబ్బులు రావడంతో అతను నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. అంతేకాదు మరో సభ్యుడిని నామినేట్  చేసే అవకాశం బిగ్‌ బాస్ అఖిల్ కు ఇవ్వడంతో అతను హారికను నామినేట్ చేశాడు. దాంతో స్వాతి, అభిజిత్, లాస్య, మోహబూబ్, హారిక, కుమార్ సాయి, సోహైల్‌ ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు. మరి నాలుగో వారం వారికి ఇచ్చే టాస్క్ లు, సభ్యుల ఫర్మామెన్స్, ప్రేక్షకుల ఓట్లు ఎవరిని బిగి బాస్ హౌస్ లో ఉంచుతాయో.. ఎవరిని ఇంటిదారి పట్టేలా చేస్తుందో తెలుస్తుంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.