ఇదేం గేమ్.. ఫొటోలను తగలబెట్టడం ఏంటి బిగ్ బాస్?
on Sep 22, 2020
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ చాలా ముఖ్యం. మొదటివారం ఇంటి సభ్యుల ద్వారా కొంతమంది నామినేషన్ అయితే అందులో ఇంటినుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ బయటకు వెళ్ళిపోయాడు. ఇక రెండోవారం సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటూ సభ్యులు జాబితాలో చేరారు. ఇందులో నుంచి కరాటే కళ్యాణి ఇంటిదారి పట్టారు. అయితే కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలని నాగార్జున హెచ్చరించారు. దాంతో మూడోవారం నామినేషన్ ప్రక్రియ పై హౌస్ మేట్స్ మధ్య టెన్షన్ ప్రారంభమైంది.
నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తూ బిగ్ బాస్ కొన్ని సూచనలు చేశాడు. నోయల్ కెప్టెన్ కాబట్టి అతనిని డైరెక్ట్ గా ఎవరినైనా నామినేట్ చేయమని చెప్పాడు. లాస్యను నామినేట్ చేశాడు నోయల్.. దాంతో ఎలిమినేషన్ జాబితాలో రెండో వ్యక్తిగా లాస్య చేరింది.
నోయల్ కెప్టెన్ కాబట్టి ఎవరూ నామినేషన్ చేయవద్దని చెప్పాడు. దేవిని బిగ్ బాంబ్ తో కళ్యాణి ఇప్పటికే నామినేట్ చేసింది కాబట్టి ఆమె పేరు కూడా ఎవరూ చెప్పవద్దన్నాడు. లాస్యను నోయల్ నామినేట్ చేసినందున ఆమె పేరు కూడా ఇంటి సభ్యులు చెప్పవద్దన్నాడు. ఇక మిగతా 13మందిలో తమను నచ్చని ఇద్దరు వ్యక్తుల ఫొటోలు ఫైర్ బాక్స్ లో వేయాలని బిగ్ బాస్ సూచించాడు.
ఇంటి సభ్యులు ఒక్కోక్కరు వచ్చిన తనకు నచ్చని వ్యక్తి ఫొటో చూపిస్తూ ఎందుకు నచ్చలేదో కారణాలు వివరిస్తూ వారి ఫొటోను ఫైర్ బాక్స్ లో వేయాలి. ఈ అగ్నిపరీక్షతో సభ్యుల మధ్య ఇప్పటివరకు ఉన్న చిన్నచిన్న మనస్ఫర్థలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఎవరు ఎవరెవరి ఫొటోలను మంటల్లో వేశారంటే...
మోహబూబ్ - అరియానా, హారిక
దేవి - అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి
హారిక - మోహబూబ్, సుజాత
అవినాష్ - మోహబూబ్, హారిక
దివి - మోనాల్, కుమార్ సాయి
అభిజిత్ - అరియానా, సుజాత
కుమార్ సాయి - మోహబూబ్, అఖిల్
గంగవ్వ - కుమార్ సాయి, మోనాల్
మోనాల్- దివి, అరియానా
అఖిల్- కుమార్ సాయి, అరియానా
సోహైల్- అరియానా, కుమార్ సాయి
అమ్మ రాజశేఖర్- అరియానా, కుమార్ సాయి
లాస్య- కుమార్ సాయి, అరియానా
అరియానా- మోనాల్, మెహబూబ్
సుజాత- హారిక, అభిజిత్
ఫొటోలను మంటల్లో వేయడం అనేది గంగవ్వకు బాధ కలిగించింది. ఇలాంటిది తన జీవితంలో ఎప్పుడు చూడలే అంటూ ఆవేదన చెందింది. కంటెస్టెంట్లు కారణాలు చెప్పే సమయంలో వారి మాటలు నిప్పురవ్వలుగా ఎగిసిపడ్డాయి. మరి ఇవి హౌస్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.