బిగ్ బాస్ 4.. ముక్కోణ ప్రేమ కథా చిత్రమ్ కానున్నదా?
on Sep 15, 2020
బిగ్ బాస్ 4 ప్రారంభం నుంచి గ్లామరస్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ వంట చేస్తూ కనిపిస్తోంది. టమాటా జ్యూస్ టాస్క్ లో అఖిల్ చెమట తుడుస్తూ ప్రేమ ఒలకబోసినప్పటి నుంచి వారిద్దరి మధ్య కాస్త అటాచ్ మెంట్ పెరిగింది. అఖిల్‌ను పాట పాడమని మోనాల్ అడగగా, అతను రాగం అందుకున్నాడు. అతని పాటకు ఫిదా అయిపోయిన మోనాల్ దిష్టి తీసింది. బిగ్ బాస్ కెమెరా ముందు అఖిల్ ను తన తల్లికి పరిచయం చేసింది మోనాల్. అయితే మోనాల్ పై అభిజీత్ ఆశలు పెట్టుకున్నాడు.
వీకెండ్ షోలో నాగార్జున కూడా "అభిజీత్ది పెద్ద కుటుంబం, మోనాల్ కు పెద్ద కుటుంబం అంటే ఇష్టం" అంటూ వారిద్దరి మధ్య ముడి వేసే ప్రయత్నం చేశారు. కానీ, మోనాల్ తనతో ఎక్కువగా మాట్లాడకపోవడంతో ఫీల్ అయ్యాడు అభిజీత్. మోనాల్ ను పిలిచి తనతో కాసేపు మాట్లడాలని కోరాడు. "నాకు టైం లేదు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది మోనాల్. దాంతో అభిజీత్ ఫీల్ అయ్యాడు.
వేకప్ సాంగ్‌లో అఖిల్, మోనాల్ జంటగా స్టెప్పులేశారు. ఆ తర్వాత అభిజీత్ మరోసారి మోనాల్ తో తన మనసులోని మాట చెప్పే ప్రయత్నం చేశాడు. "మన పరిస్థితి ఏంటో చెప్పు. కమ్యునికేషన్ గ్యాప్ వల్ల సమస్య పెద్దది అవుతుంది, మాట్లాడు" అంటూ మోనాల్ ను కోరాడు. "నా ఫీలింగ్స్‌ను ప్రశ్నించడం నాకు నచ్చడం లేదు" అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది మోనాల్. దాంతో అభిజీత్ "నువ్వు నర్మద నదివి.. కళ్ళల్లో కాళేశ్వరం ఉంది" అంటూ ఆటపట్టించాడు. వచ్చిరాని తెలుగులో "నోరు మూసుకో" అంటూ నవ్వేసింది మోనాల్. ఆమెతో తెలుగులో మాట్లాడుతూ తెలుగు నేర్పించాలన్న బిగ్ బాస్ సూచనలను చాలావరకు పాటించాడు అభిజీత్.
మోనాల్‌తో ఎక్కువసేపు గడపడానికి అభిజీత్ ప్రయత్నిస్తుంటే ఆమె అఖిల్ వైపు ఆకర్షితురాలవుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా, వారి ముగ్గురి మధ్య ముందు ముందు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడవబోతుందనే విషయం అర్థమవుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read