ENGLISH | TELUGU  

దివిని కిడ్నాప్ చేసిన రోబోలు! గేమ్‌లో భాగ‌మైన గంగ‌వ్వ‌!!

on Sep 24, 2020

 

రోబోలు, మనుషులుగా విడిపోయిన ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన ఉక్కు హృదయం టాస్క్ గెలిచేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మనుషుల టీమ్ లో బలమైన వ్యక్తులు ఉన్నారు, వారి బలంతో మనం గెలవలేమని అన్న అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అచ్చం 'రోబో' సినిమాలో హీరోయిన్ ను కిడ్నాప్ చేసిన విధంగానే బిగ్ హౌస్ లోనూ కిడ్నాప్ డ్రామాకు రిహార్స‌ల్స్‌  వేశారు.  దేవిని హారిక, అరియానా, లాస్య గట్టిగా పట్టుకుంటే ఆమె ప్రతిఘటించినట్లు, మిగతా సభ్యులు ఆమె చార్జింగ్ తీసుకున్నట్లు రిహార్స‌ల్స్‌ చేశారు. మనుషుల టీమ్ నుంచి ఎవరినైనా ఒకరిని హౌస్ లోకి పిలిచి వారి నుంచి బలవంతంగానైనా చార్జింగ్ చేసుకోవాలన్న ఆలోచనతో ఎత్తుగడ వేశారు. అభిజిత్, అవినాష్ ఇంటిసభ్యులకు ప్లాన్ వివరించారు.

ముందుగా అనుకున్న ప్లాన్  ప్రకారం అభి వెళ్ళి నోయల్, అఖిల్, మోనాల్ తో మాట్లాడాడు. వాష్ రూమ్ ఎవరికైనా అర్జెంట్ అయితే వాడుకోవచ్చని సూచించాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో "నేను పోయి చెప్తా" అంటూ గంగవ్వ రాయబారిగా ముందుకు వచ్చింది. అయితే  అభి, ఇతర సభ్యులంతా కలిసి వేసిన కిడ్నాప్ డ్రామా అంతా విన్న గంగవ్వ, "కిడ్నాప్ ను నేను సిన్మాల చూసిన. ఎవరినైనా ఇంట్లోకి తీసుకువస్"తా అంటూ లాన్ లో ఉన్న మనుషుల టీమ్ వద్దకు వెళ్ళింది.

గంగవ్వ రాకను గమనించిన అఖిల్ "నువ్వు పోయి పడుకో.. ఎందుకు వస్తున్నావు?" అంటూ ఆమెను హౌస్ లోకి పంపే ప్రయత్నం చేశాడు. "మీరంతా ఇలా బయట ఉంటే నాకు నిద్రవొస్తలేదు. వండిన అన్నం అట్లనే ఉంది. ఎవ్వరు తినలే. మీరంతా బయటే ఉన్నారు. ఆడపిల్లలు బాత్ రూమ్ కు పోకుండా ఎంతసేపు ఉంటారు. నేను  చెప్తా మీరు రండి" అంటూ అఖిల్ తో చెప్పింది. నోయల్, మోహబూబ్ కూడా "వద్దు అవ్వ.. నువ్వు లోపలికి పో" అంటూ ఆమెను హౌస్ లోకి పంపించారు. దాంతో తన మాట వారింటలేరు అంటూ అభికి చెప్పింది గంగవ్వ.

చివరగా తానే బయటకు వచ్చాడు అభిజిత్. ఎవరికైనా వాష్ రూమ్ అవసరం అయితే వెళ్ళమని నోయల్, అఖిల్ , మోనాల్ తో చెప్పాడు. సరే అంటూ ఎవరికైనా వాష్ రూమ్ కు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి అని అఖిల్ చెప్పడంతో మోనాల్ సుజాత, దివిలను అడిగింది. దివి తాను వెళ్తాను అంటూ హౌస్ లోకి అభితో పాటు వెళ్ళింది. మొత్తానికి తాము అనుకున్నది సక్సెస్ అయినందుకు రోబో టీమ్ సభ్యులు సంతోషించారు.

తెరుచుకోని బిగ్ హౌస్ తలుపులు
హస్ లోకి వచ్చిన దివి సరాసరి వాష్ రూమ్ లోకి వెళ్ళింది. ఆమె బయటకు రాగానే లాస్య, అరియానా, హారిక, దేవి ఆమెను గట్టిగా బంధించారు. అవినాష్, అభిజిత్ చార్జింగ్ లు పెట్టుకున్నారు. గంగవ్వ కూడా మిగతా సభ్యులతో పాటు దివిని గట్టిగా పట్టుతుంది. ఆ తర్వాత దేవి అన్నం తీసుకువస్తే దివికి గంగవ్వ తినిపించింది. అయితే హౌస్ లో నుంచి దివి కేకలు విన్న నోయల్, అఖిల్, మోనాల్ పరుగుపరుగన బిగ్ హౌస్ డోర్ వద్దకు వచ్చారు. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో గట్టిగట్టిగా అరుస్తూ .. బిగ్ బాస్ ఒకసారి డోర్ తీయండి అంటూ అభ్యర్తించాడు నోయల్, మోనాల్. అయినా హౌస్ తలపులు తెరుచుకోలేదు.
 


లాన్ లో ఉన్న మనుషుల టీమ్ కు దివిని కిడ్నాప్ చేశారని అర్థమైంది. ఎంతో నమ్మకంగా వచ్చి అమ్మాయిలను టార్గెట్ చేసి చార్జింగ్ పెట్టుకోవడంపై వారంతా ఆగ్రహంతో ఊగిపోయారు. వీళ్ళ గోలకు నిద్రపోతున్న సోహేల్, రాజశేఖర్, సుజాత కూడా నిద్రలేచారు. జరిగిన విషయం తెలుసుకుని కోపంతో రగిలిపోయారు. సోహైల్, మోహబూబ్ గట్టిగట్టిగా అరుస్తూ "ఆడపిల్లను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడతారా?" అంటూ అభిజిత్ ను తిట్టారు. అందరు డోర్ వద్దకు వచ్చి అరిచిగోలచేసినా బిగ్ హౌస్ డోర్ ఓపెన్ కాలేదు.

కాసేపటికి దివిని వదిలివేయడంతో ఆమె డోర్ వద్దకు వచ్చింది. అయితే డోర్ ఓపెన్ కాలేదు. దివి లోపల ఏం జరిగిందో, ఎవ్వరు ఎవ్వరు చార్జింగ్ పెట్టుకున్నారో చెప్పింది. కాసేపటి తర్వాత డోర్ ఓపెన్ కావడంతో మనుషుల టీమ్ సభ్యులు హౌస్ లోకి వచ్చారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.