పవన్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ ప్రైజ్.. తగ్గేదే లేదు
on Jul 27, 2021
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీలో పవన్ 'భీమ్లా నాయక్' అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా పవన్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో.. 'భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ' అంటూ మూవీ టీమ్ సోమవారం ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఖాకీ దుస్తుల్లో ఉన్న పవన్ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.
'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ కు సంబంధించి మేకింగ్ గ్లింప్స్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 51 సెకన్లు ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. పవన్ సెట్ లోకి ఎంటర్ అవుతున్న షాట్ తో వీడియో ప్రారంభమైంది. ఈ వీడియోలో పవన్, త్రివిక్రమ్, రానా, సాగర్ కె చంద్ర వంటి వారు కనిపించారు. ముఖ్యంగా భీమ్లా నాయక్ గా పవన్ కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖాకీ దుస్తుల్లో పవన్ నడిచి వస్తున్న షాట్.. ఈ వీడియోను ఫ్యాన్స్ పదే పదే చూసేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ వీడియోలో రానా లుక్ తో పాటు తమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు వీడియోలో తెలిపారు.
ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.