అంతా ఊహించిందే.. బిగ్ బాస్-2 టైటిల్
on Oct 1, 2018
తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమై ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్.గత ఏడాది సీజన్ -1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా శివబాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచారు.మొదటి సీజన్ పెంచిన ఆసక్తి తో బిగ్ బాస్ సీజన్-2 భారీ అంచనాలతో ప్రారంభం అవ్వగా నాని హోస్ట్ గా వ్యవరించారు. అయితే గత సీజన్ లో బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ నుంచి టైటిల్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనే అంశాలు ఎంతో గోప్యంగా ఉన్నాయి.కానీ ఈ సీజన్ లో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతున్నారు,చివరికి టైటిల్ విన్నర్ ఎవరు అనేది కూడా ముందే లీకు అవ్వటంతో ఈ సీజన్ పేలవంగా సాగిందని నేటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందరు ఊహించినట్లే కౌశల్ బిగ్ బాస్-2 టైటిల్ విన్నర్ గా నిలిచాడు.ఈ షో వల్ల కౌశల్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు.
సోషల్‌మీడియాలో ‘కౌశల్‌ఆర్మీ’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. అభిమానులు ఆయనకు మద్దుతుగా ర్యాలీ కూడా నిర్వహించారు. ఓ కంటెస్టెంట్ కోసం ఇంతలా ప్రేక్షకులు స్పందించటం కూడా అప్పట్లో ఇందంతా కౌశల్ బిగ్ బాస్ లో కి ఎంట్రీ ఇవ్వకముందే ప్రీ ప్లాన్డ్ గా రంగం సిద్ధం చేసుకున్నాడంటూ వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. ఏదైతేనేం కౌశల్ టైటిల్ గెలుచుకున్నాడు.పోటీలో తుది వరకూ గీతా మాధురి గట్టిపోటీ ఇచ్చినా చివరకు కౌశల్‌నే విజయం వరించింది. ఫినాలే కి విక్టరీ వెకంటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.కౌశల్ కి టైటిల్ , రూ.50 లక్షల బహుమతి అందించారు.ఫినాలేకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులతోపాటు.. ఫైనలిస్టులు కౌశల్, గీత, తనీష్, దీప్తి, సామ్రాట్ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఫినాలే వేడుకలో హౌస్మేట్స్ అంతా సందడిగా కనిపించారు. డ్యాన్సులతో అదరగొట్టారు. భావోద్వేగానికి గురయ్యారు.సీజన్ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంటులు పాల్గొన్నారు.