ఆ నటి ఫ్యామిలీ అంతా కరోనా బాధితులే!
on Jul 11, 2020
బెంగాలీ నటి కోయల్ మల్లిక్ కొవిడ్-19 బారిన పడింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా పాజిటివ్‌గా టెస్టుల్లో నిర్ధారణ అవడం కలకలం రేపింది. ఆమె తండ్రి, ప్రముఖ వెటరన్ బెంగాలీ నటుడు రంజిత్ మల్లిక్, ఆమె తల్లి దీపా మల్లిక్, భర్త నిస్పాల్ సింగ్ లకు కొవిడ్-19 సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోయల్ మల్లిక్ తెలిపింది. ప్రస్తుతం తాము హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు ఆమె వెల్లడించింది. "నాన్న, అమ్మ, రాణే (భర్త), నేను కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాం" అని ఆమె ట్వీట్ చేసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతా ఆ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని బెంగాలీ చిత్రసీమ సభ్యులు ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఘోరే అండే బైరే, ఛాయా ఓ ఛోబి, శుభోదృష్టి, హెమ్లాక్ సొసైటీ లాంటి సినిమాల ద్వారా కోయల్ పాపులర్ అయ్యింది. 2013లో నిర్మాత నిస్పాల్ సింగ్‌ను ఆమె పెళ్లాడింది. రెండు నెలల క్రితమే మే 5న ఆమెకు కొడుకు జన్మించాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, "ఈ రోజు ఉదయం మా బుడ్డోడు పుట్టాడు. మీతో మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. అలాగే మా బేబీ బాయ్‌కి మీ ఆశీర్వాదాలు ఆశిస్తున్నాం" అని పోస్ట్ చేసింది కోయల్.
Also Read