బండ్ల గణేష్ సేఫ్!
on Jun 30, 2020
కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కరోనా నుండి పూర్తి ఆరోగ్యంగా బయటపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కొవిడ్ 19 సోకిన సంగతి తెలిసిందే. దాంతో హైదరాబాద్ ఫిలిం నగర్ లోని గేటెడ్ కమ్యూనిటీలో తన ఇంటిని వదిలి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకోవడంతో పాటు కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రతిరోజు యోగా, మెడిటేషన్ వంటివి చేశానని చెప్పారు.
తాజాగా అపోలో హాస్పటల్ లో కరోనా టెస్టులు చేయించుకోగా నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయి. టెస్ట్ రిజల్ట్స్ రిపోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు బండ్ల గణేష్. దాంతో భగవంతుడికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన ఆరోగ్యంగా కరోనా బారి నుండి బయటపడడంతో అభిమానులు సంతోషపడ్డారు. ఈ సందర్భంగా 'నెగటివ్ అనేది చాలా విలువైన పదం అని తెలిసింది' అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.