బాలయ్య సరసన బాపుబొమ్మ
on Aug 23, 2014
'అత్తారింటి దారేది'తో తెలుగువారికి బాగా దగ్గరైన నటి ప్రణీత. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రభస'లో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ బాపుబొమ్మకి గోల్డెన్ చాన్స్ దక్కింది. నందమూరి బాలయ్య పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. బాలకృష్ణ, సత్యదేవ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ కోసం గత కొన్ని రోజులుగా తెగ కిందామీదా పడిన యూనిట్ ఆఖరికి ప్రణీతను ఓకే చేశారు.