English | Telugu

బాలీవుడ్ రీమేక్‌లో బాల‌య్య‌!!

on Jul 8, 2019

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ గ‌తంలో `మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు`, ముద్దుల మావ‌య్య‌` లక్ష్మీ న‌ర‌సింహా`, ఇలా ప‌లు రీమేక్ చిత్రాల‌లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒరిజిన‌ల్ వెర్ష‌న్స్ కంటే కూడా బెట‌ర్ గా రీమేక్స్ హిట్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రో రీమేక్ చిత్రంలో న‌టించబోతున్నారంటూ ప్ర‌స్తుతం చిత్ ప‌రిశ్ర‌మ‌లో వార్త‌లు జోరందుకున్నాయి.  ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళితే...త్రి ఇయ‌ర్స్ బ్యాక్ బాలీవుడ్ లో  అమితాబ‌చ్చ‌న్, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా బిగ్ స‌క్సెస్ అందుకున్న  `పింక్` చిత్రాన్ని తెలుగు రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు రీమేక్ రైట‌న్స్ ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నార‌ని తెలిసింది. చాన్నాళ్లు గా బాల‌య్య‌తో సినిమా చేయాల‌నుకుంటున్న దిల్ రాజు ఇప్పుడీ రీమేర్ బాల‌య్య‌తో చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ నిజం ఎంతుందో తెలియాలంటే అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే మ‌రి.


Cinema GalleriesLatest News


Video-Gossips