బాలయ్య వచ్చాడు.. ఫైట్ మొదలుపెట్టాడు!
on Mar 2, 2020
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న మూవీ సోమవారం రెగ్యులర్ షూట్‌లోకి అడుగుపెట్టింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ఆ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతున్న మూడో సినిమా. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో బాలయ్య, విలన్లపై ఒక ఫైట్‌ను బోయపాటి చిత్రీకరిస్తున్నారు. ఇది పెద్ద షెడ్యూల్ అని యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా బాలకృష్ణ కాకుండా మిగతా నటీనటుల పేర్లను అధికారికంగా ఇంతవరకూ వెల్లడి చెయ్యలేదు. ఒక హీరోయిన్గా అంజలి ఎంపికైనట్లు ప్రచారంలోకి వచ్చింది. మరో నాయిక కూడా ఇందులో ఉంటుంది.
'సరైనోడు' మూవీ తర్వాత మళ్లీ ఈ సినిమాకు తమన్‌తో బాణీలు కట్టిస్తున్నాడు బోయపాటి. సి. రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ సాధిస్తుందా, లేదా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో ఉంది. బాలయ్య ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'మహానాయకుడు', 'రూలర్' సినిమాలు వరుసగా ఫెయిల్ అవడంతో ఆయన మార్కెట్ కూడా బాగా పడిపోయింది. తను క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బయట పడేస్తూ వస్తున్న బోయపాటిని ఆయన మరోసారి నమ్ముకున్నాడు.