బాలయ్య 'ఇండస్ట్రీ హిట్' ఫిల్మ్ డేట్‌కి.. బోయపాటి మూవీ?
on May 30, 2020
‘సమరసింహారెడ్డి’.. నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ప్రత్యేక చిత్రం. 1999 సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ గత రికార్డులను భూస్థాపితం చేసి అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే, వరుస పరాజయాలు చూస్తున్న బాలయ్యకి గొప్ప ఊరటనిచ్చింది. అలాంటి ‘సమరసింహారెడ్డి’ రిలీజ్ డేట్‌ని టార్గెట్ చేసుకుని బాలయ్య నుంచి ఇప్పటి వరకు మరో చిత్రం రానేలేదు. అయితే దాదాపు 22 ఏళ్ళ తరువాత అదే తేదీని టార్గెట్ చేసుకుని బాలయ్య కొత్త చిత్రం రాబోతుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి ఘనవిజయాల తరువాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే తొలి దశ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా మలి దశ చిత్రీకరణకి బ్రేక్ పడింది. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత చిత్రీకరణ పునఃప్రారంభించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని బోయపాటి అండ్ టీమ్ భావించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బాలయ్య, బోయపాటి థర్డ్ వెంచర్ ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని వినికిడి. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య లక్కీ సీజన్ సంక్రాంతికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. అంతేకాదు.. ‘సమరసింహారెడ్డి’ విడుదల తేదీ అయిన జనవరి 13న ‘NBK106’ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘లారీడ్రైవర్’(1990), ‘రౌడీ ఇన్స్పెక్టర్’(1992) వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ తరువాత బాలయ్య, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ‘సమరసింహారెడ్డి’ రూపొంది హ్యాట్రిక్ హిట్‌గా నిలిస్తే.. ‘సింహా’(2010), ‘లెజెండ్’(2014) వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబోలో దాదాపు ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం హ్యాట్రిక్ వెంచర్ తెరకెక్కుతోంది. అంతేకాదు.. ‘NBK106’కి వినిపిస్తున్న రిలీజ్ డేట్ (2021 జనవరి 13), ‘సమరసింహారెడ్డి’ (1999 జనవరి 13) రిలీజ్ డే రెండూ కూడా బుధవారమే కావడం విశేషం.
మరి.. ‘సమరసింహారెడ్డి’ సెంటిమెంట్ రిపీట్ అయి బాలకృష్ణ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ యాడ్ అవుతుందేమో చూడాలి.