ENGLISH | TELUGU  

ముచ్చటగా మూడు మల్టీస్టారర్లు

on Nov 20, 2017

కొత్త కథలు పుట్టాలంటే...  మార్పు రావాల్సింది హీరోల్లో. మంచి కథలంటే మల్టీస్టారర్లతోనే సాథ్యం. బాలీవుడ్ హీరోలంతా మల్టీస్టారర్ల వైపు మొగ్గడానికి కారణం అదే. అయితే.. మల్టీస్టారర్లు చేయడం సాధారణమైన విషయమేం కాదు. ముందు హీరోల్లో విశాల హృదయం ఉండాలి. మార్కెట్ ని బట్టి, నిర్మాత శ్రేయస్సు బట్టి పారితోషికాలుండాలి. ఇగో ప్రాబ్లమ్స్ పక్కనపెట్టాలి. కథనే హీరోగా నమ్మాలి. నీకెన్ని సీన్లు, నాకెన్ని సీన్లు.. అనే విధానాలకు స్వస్థి పలకాలి. అప్పుడే గొప్ప కథలు సెల్యులాయిడ్ పై ఆవిష్కృతం అవుతాయ్.

బాలీవుడ్ లో అది వర్కవుట్ అయ్యింది కానీ... దక్షిణాదిన మల్టీస్టారర్లంటే తేలికైన వ్యవహారం కాదు. ఇక్కడ వ్యక్తి పూజ ఎక్కువ. అందుకే.. మల్టీస్టారర్లు ఇక్కడ కరువయ్యాయ్. అయితే... నేటి కథానాయకులందరూ యువకులు. అందరికీ స్నేహభావం ఎక్కువ. అందుకే... వీళ్లందరూ ఇగోలను పక్కనపెట్టి మల్టీస్టార్లు చేయడానికి ముందుకొస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లు కూడా... వారి తరంలో మల్టీస్టారర్లు చేయలేకపోయినా.. జూనియర్లతో కలిసి చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం.
రానున్న రోజుల్లో తెలుగు తెరపై మల్టీస్టారర్ల రూపంలో అద్భుతాలు జరగనున్నాయ్. ఇప్పటికే మూడు మల్టీస్టారర్లు ఖరారయ్యాయ్. వాటిల్లో మొదటిది చిరంజీవి-పవన్ కల్యాణ్ మల్టీస్టారర్.

టి.సుబ్బిరామిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ప్రస్తుతం త్రివిక్రమ్ కథ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఎప్పుడైనా అధికార ప్రకటన రావొచ్చు. బహుశా.. ఎన్టీయార్ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా ఇదే అవుతుందేమో.

తర్వాత మల్టీస్టారర్ బాలయ్య, మహేశ్ బాబు

దీనికి దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి కథను తయారు చేసేపనిలో ఉన్నాడు. ఒక హీరోతో సినిమా చేస్తేనే బోయపాటి ఎమోషన్లను తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమా అంటే.. ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్టీయార్-కృష్ణ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇప్పుడు వారిద్దరి వారసులు కలిసి నటించనుండటం విశేషం. కృష్ణ-బాలకృష్ణ కూడా ‘సుల్తాన్’ లో కలిసి నటించారు.  

ఇక మూడో మల్టీస్టారర్ కథ ఇప్పుడే వెలుగు చూసింది.  అదే.. తారక్-చరణ్ ల సినిమా. దానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అవ్వడం విశేషం. ఫిబ్రవరిలో సినిమా లాంచనంగా ప్రారంభం  అవుతుందట. అంటే మొదట మొదలయ్యే మల్టీస్టారర్ ఇదే నన్నమాట. ఇక ముందు ముందు.. ఇంకా ఎవరెవరు కలుస్తారో.. ఏ విధమైన కథలు మనకు చూపిస్తారో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.