'గౌతమి పుత్ర శాతకర్ణి' మినీ రివ్యూ..
on Jan 12, 2017
దేశం మీసం తిప్పే టైం రానే వచ్చింది. సమయం లేదు మిత్రమా అని బాలయ్య చెప్పిన ఆ టైమింగ్ మన ముందు సాక్షాత్కరమైంది. శిథిలమైన పుటలల నుండి తీసిన తెలుగు వాడి చరిత్ర ని తెలుసుకొని గర్వంగా ఫీలయ్యే సమయం ఆసన్నమైంది. సాహో గౌతమి పుత్ర శాతకర్ణి అంటూ బాలయ్యకు నిరాజనాలు పలుకుతున్నారు.
* గౌతమిపుత్ర శాతకర్ణి బుర్రా సాయిమాధవ్ రాసిన ప్రతి డైలాగ్ బాలయ్య నట విశ్వరూపంతో స్ర్కీన్ పై చెబుతుంటే అద్భుతం-అత్యద్భుతంగా వున్నాయి.
* బాలయ్యకు జోడీగా నటించిన శ్రియ నటన కూడా అద్బుతంగా వుంది. కొన్ని సన్నివేశాల్లో శ్రియ నటన కంటతడి పెట్టిస్తుంది.
* డ్రిమ్ గాళ్ హేమమాలిని శాతకర్ణిలో మాతృమూర్తి పాత్రలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ.. ఆ పాత్రలో ఒదిగిపోయారు.
* దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ని చేతపట్టి సినిమాను నడిపించిన తీరు మహాద్బుతం. ప్రతి ఒక్క సీన్ ని ఎంతో రక్తి కట్టించేలా తీసాడు క్రిష్.
ఫ్లస్ పాయింట్స్:
– బాలయ్య చేసిన విరోచిత యుద్ధ విన్యాసాలు, డైలాగ్స్, నట విశ్వరూపం
– స్టోరీ-స్క్రీన్ ప్లే – క్రిష్ మైండ్ బ్లోయింగ్ డైరెక్షన్
– ఆర్ట్ వర్క్
– యుద్ధ సన్నివేశాలు
– మ్యూజిక్
– నిర్మాణ విలువలు
– సినిమాటోగ్రఫీ
– ఎడిటింగ్..అన్ని సాంకేతిక విభాగాలు
మైనస్ పాయింట్స్:
– కొన్ని చోట్ల క్వాలిటీ తగ్గిన విజువల్స్
– శాతకర్ణిని కేవలం యుద్ధకోణంలో చూపించడం
– కథను డామినేట్ చేసిన యుద్ధం సన్నివేశాలు
ఏదేమైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం దేశం మీసం తిప్పే గొప్ప చిత్రం అని అంటున్నారు.
Also Read