English | Telugu

'గౌతమీపుత్ర శాతకర్ణి'.. సెలబ్రిటీల ట్వీట్స్..

on Jan 12, 2017


నందమూరి బాలకృష్ణ నటించిన వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా పలువురు టాప్ హీరోలు, సెలబ్రిటీలు బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ఎవరెవరు ఏం ట్వీట్ చేశారో ఓసారి చూద్దాం..

దర్శకుడు రాజమౌళి  'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి ట్వీట్టర్లో ప్రశంసల వర్షం కురిపించాడు.

'సాహో బసవతారకమ్మ పుత్ర బాలకృష్ణ. నందమూరి తారక రామారావుగారి గర్వపడేరీతిలో శాతకర్ణిగా నటించిన (బాలకృష్ణ) సార్ కు సెల్యూట్ చేస్తున్నా. పైనుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు మీకు ఉంటాయి' అని ట్వీటాడు. ఇంకా 79 రోజుల్లో ఈ ఎపిక్ సినిమాను మీరు ఎలా తీశారు? నమ్మశక్యం లేదు. మీ నుంచి నేను చాలాచాలా నేర్చుకోవాలి అని అన్నారు. సాయిమాధవ్ గారి డైలాగ్స్ గురించి కూడా రాజమౌళి ట్విట్టర్లో ప్రస్తావించి ఆయనను కూడా ప్రశంసించారు. సాయిమాధవ్ గారు 'మీ పెన్నే శాతకర్ణి కత్తి' అని కొనియాడారు. అద్భుతమైన కెమెరా వర్క్, అసాధారణ నిర్మాణ విలువలు గర్వించే తెలుగు సినిమాగా శాతకర్ణిని చాలారోజులు గుర్తుండిపోయేలా చేస్తాయి' అని రాజమౌళి ట్విట్టర్లో తెలిపారు.


అక్కినేని నాగార్జున..

నాగార్జున కూడా బాలయ్యకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. చారిత్రక సినిమాలు చూడటం తనకు ఇష్టమని, ఈ సినిమా చరిత్ర సృష్టించాలని నాగార్జున ఆకాంక్షించారు.

మోహన్ బాబు..

బాలయ్యను సోదరుడిగా సంభోదిస్తూ మోహన్ బాబు ఆయనకు అభినందనలు తెలిపారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' మంచి విజయం సాధిస్తుందని తెలిపారు. ఇంకా ఇలాంటి గొప్ప సినిమా అందించినందుకు గాను క్రిష్ ను ప్రశంసించారు.

అనసూయ..

యాంకర్ అనసూయ కూడా ట్విట్టర్ ద్వారా బాలయ్యకు అభినందనలు తెలిపింది. అంతేకాదు ఈ సినిమాలో తనకు ఓ చిన్న పాత్ర ఇచ్చినందుకు గాను దర్శకుడు క్రిష్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here