వాన పాటలో బాలయ్య, రకుల్.. లుక్ అదుర్స్
on Oct 10, 2018
ఎన్టీఆర్ బయోపిక్ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కాని ఇప్పటివరకు విడుదలైన ప్రతి పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అంచనాలను రోజురోజుకి రెట్టింపు చేస్తున్నాయి. ఎన్టీఆర్ గా బాలకృష్ణ, చంద్రబాబుగా రానా, ఏయన్నార్ గా సుమంత్ లుక్స్ విడుదల చేసి ప్రేక్షుకులను ఆకట్టుకున్న చిత్రయూనిట్.. ఈరోజు శ్రీదేవిగా రకుల్ లుక్ ని విడుదల చేసి ప్రేక్షకులను ఖుషీ చేసింది. అయితే తాజాగా మరో పోస్టర్ విడుదల చేసి ఈ ఖుషీని రెట్టింపు చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ వేటగాడు చిత్రంలోని ‘ఆకు చాటు పిందె తడిసే’ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ పాట ఎన్టీఆర్ బయోపిక్ లోకూడా ఉండనుంది. ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి చిందేసిన ఈ వాన పాటలో ఇప్పుడు బాలయ్య, రకుల్ చిందేయబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బాలయ్య, రకుల్.. ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తుచేస్తున్నారు. మరి మాస్ ని అప్పట్లో ఉర్రుతలూగించిన ఈ సాంగ్.. మరోసారి అదే రేంజ్ లో అలరిస్తుందేమో చూడాలి.